పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో, సినీ పరిశ్రమకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పై మాట్లాడుతూ, వైసీపీ ని టార్గెట్ చేసారు. అలాగే కొన్ని మీడియా చానల్స్ ని కూడా, పవన్ టార్గెట్ చేస్తూ, కాపు రిజర్వేషన్ గురించి గతంలో మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని అడిగారు, అలాగే కోడి కత్తి గురించి, వివేక కేసు గురించి, ఇలా అనేక విషయాల పై మాట్లాడారు. అలాగే సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మేది, కేవలం అప్పు తెచ్చుకోవటానికి అని పవన్ అన్నారు. ఇక పేర్ని నానిని సన్నాసి అన్నారు. అలాగే అవంతిని అరగంట విద్వంసుడు అన్నారు. ఇలా అనేక విమర్శలు చేసారు. దీంతో వైసీపీ కూడా అంతే ఇదిగా స్పందించింది. వరుస పెట్టి మంత్రులు వచ్చారు. పేర్ని నాని కూడా పవన్ ని సన్నాసి అన్నారు. ఈ నా కొడుకు, ఆ నా కొడుకు అంటూ వైసీపీ అధికార భాషలో మాట్లాడారు. అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ ఇలా చాలా మంది పవన్ కు కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇంకా వైసీపీ పెద్దల ఖచ్చి తీరలేదు ఏమో కానీ, ఈ రోజు పోసానిని రంగంలోకి దింపారు. గతంలో శ్రీరెడ్డి, కత్తి మహేష్ పోషించిన పాత్రను, ఇప్పుడు పోసాని చేత తీరుస్తూ, వైసీపీ పెద్దలు, పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇప్పించే ప్రయత్నం చేసారు.

posani 27092021 2

పోసాని కూడా వైసీపీ పెద్దల అంచనాలకు తగ్గట్టే మాట్లాడారు. పవన్ ని అనేక విధాలుగా క్యారక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసారు. ఒక అమ్మాయికి కడుపు చేసారు, అయుదు కోట్లకు బేరం కుదిర్చారు అంటూ, పరోక్షంగా పవన్ పై విమర్శలు చేసారు. గతంలో కూడా ఇలాగే శ్రీరెడ్డి, కత్తి మహేష్ చేత తిట్టించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ్యత పోసాని తీసుకున్నారు. అయితే నిన్న మంత్రులకు కౌంటరో, నేడు పోసానికి కౌంటరో కాని, పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు వదులుతున్నారు. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు, సహజమే అంటూ ట్వీట్ చేసారు. కొద్ది సేపటికే, నాకు ఇష్టమైన పాట అంటూ, హూ లెట్ ద డాగ్స్ అవుట్ అంటూ, వైసీపీ నేతలను ఉద్దేశించి పోస్ట్ చేసారు. అయితే ఇక్కడ పవన్, పోసాని లాంటి వాళ్లకు కూడా రియాక్ట్ అవుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పవన్, జగన్ తో యుద్ధం చేయాలి కాని, పోసాని లాంటి వాడు మాట్లాడినా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని, విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read