నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్‌ హ్యాట్రిక్‌ ఎంపీ ఎస్పీవైరెడ్డి మృతి తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ అన్నారు. ఎస్పీవైరెడ్డి ఏప్రిల్‌ 30వ తేదీ రాత్రి 9.15 గంటలకు హైదరబాద్‌లోని బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. మే 2న ఎస్పీవైరెడ్డి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన పవన్‌కళ్యాణ్‌ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రత్యేకంగా శనివారం నంద్యాలకు వచ్చారు. బొమ్మలసత్రంలోని ఎంపీ ఎస్పీవైరెడ్డి ఇంటికి మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వచ్చారు. ఎస్పీవైరెడ్డి సమాధి వద్ద పవన్‌ కళ్యాణ్‌తో పాటు జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్‌, రామ్మోహన్‌రావు, మాదాసు గంగాధర్‌ పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.

pk 12052019

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఎస్పీవైరెడ్డి సతీమణి పార్వతి, కుమార్తెలు సుజల, అరవిందరాణి, అల్లుళ్లు శ్రీధర్‌రెడ్డి, సురే్‌షకుమార్‌, కుటుంబ సభ్యులతో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఎస్పీవైరెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. అనంతరం విలేఖరులతో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ ఒక్క రూపాయికి రొట్టె, పప్పు పథకాన్ని ప్రారంభించిన ఎస్పీవైరెడ్డి ఒక్క రూపాయికే రైతులకు పైపులను బాడుగకు అందించి రైతు నాయకుడిగా చెరగని ముద్ర వేశారని అన్నారు. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందారని అన్నారు. సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాటాలు, దీక్షలు చేశారని అన్నారు. ఎస్పీవైరెడ్డి మరణంతో నైతిక విలువలు గల నాయకుడ్ని కోల్పోయామని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీవైరెడ్డి తమ పార్టీలోకి వస్తామనగానే మనస్ఫూర్తిగా ఆహ్వానించి టికెట్‌ ఇచ్చామని అన్నారు. అయితే అనారోగ్యంతో ఎస్పీవైరెడ్డి మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

pk 12052019

ఇది సందర్భంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తన పని తాను చేస్తానని, దాని ఫలితం గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పారు. నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్... ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. ‘మార్పుకి నాంది పడింది. అంతవరకు చెప్పగలను. నా పని నేను చేసుకుంటా. మిగతాది వదిలేస్తా. ఫలితాల మీద నేను చెప్పడం ఎందుకు? నేను చెప్పినంత మాత్రాన బాక్సుల్లో ఫలితాలు మారిపోవు కదా. ఏదేమైనా అందరూ గెలవరు కదా. ఒక్కరే గెలవాలి. వాళ్లెవరో చూద్దాం. ఈవీఎం స్లిప్పులను కొంత మేర లెక్కించాల్సిన అవసరం అయితే ఉంది. అది చంద్రబాబు కోరుతున్నట్టు 50 శాతమా,ఇంకా ఎక్కువా తక్కువా అనేది కొందరు పెద్దలు కూర్చుని చర్చించాలి.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read