ఒక పక్క కర్ణాటకలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం పై, దేశం మొత్తం వ్యతిరేకత వస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం, కర్ణాటకలో గవర్నర్ చేసింది కరెక్ట్ అంటున్నారు.. ఎవరు కలిసి పొత్తు పెట్టుకున్నా, అతి పెద్ద పార్టీలను పిలవటం అనేది కరెక్ట్ అని, అయినా అది గవర్నర్ ఇష్టం అని పవన్ అన్నారు.. నిన్న ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, పవన్ ఈ వ్యాఖ్యలు చేసారు.. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తారని, ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదని పవన్ అన్నారు... ఏ పార్టీకి, ఇతర పార్టీలను, నిందించే నైతిక హక్కు లేదని, అందరూ అంతే అని పవన్ కళ్యాణ్ అన్నారు.... ANIతోనే కాదు, నిన్న వైజాగ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా, పవన్ ఇవే వ్యాఖ్యలు చేసారు.. కర్ణాటకలో జరుగుతున్నది తప్పని గానీ, ఒప్పని గానీ రాజకీయ పార్టీలు ఏ విధంగానూ ప్రశ్నించలేవని అన్నారు..
అయితే పవన్ వ్యాఖ్యల పై అందరూ ఏకీభవిస్తారు... అందరూ అదే అంటున్నారు కూడా, ఆ రోజు కాంగ్రెస్ చెయ్యలేదా ? ఈ రోజు బీజేపీ చేస్తే తప్పు వచ్చిందా అని అడుగుతున్నారు.. అలాగే అక్కడ కెసిఆర్ చేసిన ఫిరాయింపులు, ఇక్కడ ఆంధ్రాలో వైసిపీ నుంచి టిడిపిలోకి వచ్చిన ఫిరాయింపులు కూడా తప్పే... అసలు దీంట్లో రెండో ఆలోచాలనే లేదు.. చట్టాల్లో మార్పులు రావాలి, రాజకీయ నాయకుల విధానాలు మారాలి... అయితే ఇక్కడ పవన్ ఒక్క విషయం మర్చిపోతున్నారు... ఇక్కడ ఉన్న పార్టీలు అన్నీ వెధవలు, నేను పెద్ద నీతి పరుడుని, నిజాయాతీపరుడుని అని, ఎవడిని అయినా ప్రశ్నిస్తా అని చెప్పుకునే పవన్, ఇలా ఒక్క మాటతో ఎలా తప్పించుకుంటారు ?
సినిమాలు వదిలేసి, నెల క్రితం రాజకీయాల్లోకి ఫుల్ టైం వచ్చినట్టు కనిపిస్తున్నాడు... కళ్ళ ముందు అమిత్ షా, మోడీ కలిసి ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు... 100 కోట్లకు ఎమ్మల్యేలను కొంటున్నారు... దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చెయ్యాలని అమిత్ షా, మోడీ పన్నాగం పన్నారు... ఈ వికృత క్రీడను, పవన్ ఎందుకు ఖండించడు ? అందరూ ఒక్కటే అని చెప్పి తప్పించుకోవటం ఏంటి ? దేశం అంతా గవర్నర్ చేసింది తప్పు అంటుంటే, గవర్నర్ చేసింది కరెక్ట్ అని పవన్ చెప్పటం దేనికి సంకేతం ? అన్ని రాజకీయ పార్టీలు అంతే, ఎవరికీ హక్కు లేదు అనే పవన్, మరి నువ్వు ఎందుకు బీజేపీని నిలదియ్యవు ? మోడీ అంటే భయమా ? అమిత్ షా అంటే భయమా ? ఇప్పటికే గత రెండు నెలల నుంచి, విభజన హామీల పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా, పవన్ చేస్తున్న పనులు చూసి, బీజేపీ లొంగిపోయాడు అనే అభిప్రాయం ఉంది.. ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలు, కర్ణటకలో జరుగుతున్న పరిణామాల పై, మోడీ, అమిత్ షా పై పోరాటం చేస్తుంటే, వారికి ఒక్క మాట కూడా అనకుండా, అందరూ ఒక్కటే అనే మాట చెప్పి తప్పించుకోవటం చూస్తుంటే, బీజేపీకి ఎలా లొంగిపోయాడో అర్ధమవుతుంది.