అక్టోబర్ 27 నుంచి మొదల్లవాల్సిన జగన్ పాదయాత్ర, జోతిష్యుల హెచ్చరికతో, నవంబర్ 2 వ తేదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే... జగన్ ఈ పాదయాత్ర ప్రెపరేషన్స్ లో ఉన్నారు... ఇప్పటికే 6 నెలల పాటు కోర్ట్ కి రాను అని, కోర్ట్ పర్మిషన్ అడిగారు జగన్...
అలాగే ప్రశాంత్ కిషోర్ , విజయ సాయితో కలిసి, పాదయాత్ర రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు... మరో పక్క ఫిట్నెస్ కోసం, రోజూ ట్రెడ్ మిల్ మీద నడక ప్రాక్టిస్ చేస్తున్నారు...
ఈ సందర్భంగా మరో కొత్త విషయం బయటకి వచ్చింది... పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్తున్న జగన్ ఎలాంటి వేష ధారణతో రావాలి అనే దాని మీద చర్చ జరిగింది... రైతులని ఆకట్టుకుంటానికి, రాజశేఖర్ రెడ్డిలా, పంచె కట్టుకుని, పాదయాత్ర చెయ్యాలి అని అనుకున్నారు.. దీంట్లో రైతులని ఆకట్టుకుంటంతో పాటు, జగన్ లో, రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకుంటారు అని ఇలా అనుకున్నారు...
అయితే మారిన పరిస్థుతుల్లో, హిందూ వ్యతిరేకి అని ముద్ర చేరిపేయటంతో పాటు, బీజేపి, అరఎస్ఎస్ ను మచ్చిక చేసుకోవటానికి, కాషాయం బట్టలతో పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనే దాని పై కూడా చర్చులు నడుస్తున్నాయి... ఇది వరకు అన్నగారు చైతన్య రధంతో పర్యటన చేసినప్పుడు ఖాకీ బట్టలు వేసుకున్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు... మొన్న మధ్య జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే, ఖాకీ బట్టలు వేసుకున్న సంగతి కూడా ప్రస్తావనకు వచ్చింది... అలాగే, కాషాయం బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది అని జగన్ ఆలోచిస్తున్నారు...
అయితే ఈ సందర్భంలో, రాజశేఖర్ రెడ్డి కాని, చంద్రబాబు కాని, చివరకు జగన్ చెల్లి షర్మిల కాని పాదయత్ర చేసినప్పుడు, తమ ఒరిజినాలిటీ పక్కన పెట్టలేదు.. వాళ్ళ స్టైల్ లో, ఎప్పుడూ ఉండే లాగే, ప్రజల మధ్యకు వెళ్లారు.... జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా, ప్రజల మధ్యకు కొత్తగా, కొత్త జగన్ లా కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు... మరి అది పంచె కట్టా.... లేక కాషాయం బట్టలా అనేది తెలియాల్సి ఉంది...