మొన్న శ్రీకాకుళంలో ఆవులు వస్తే నన్ను చంపటానికే అని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అలాగే నా ఇంటి పై డ్రోన్ లు తిప్పుతున్నారు, నన్ను చంపేస్తున్నారు అని చెప్పిన విషయం తెలిసిందే. ఇది కాకుండా, అసలు హైలైట్ ఏంటి అంటే, నా హత్యకు ముగ్గురు మాట్లాడుకుంటే అది నేను విన్నాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ఎవరయ్యా అని పోలీసులు అడిగితే మాత్రం, నాకు నన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసు అంటాడు. సెక్యూరిటీ ఇస్తే తిప్పి పంపిస్తాడు, మళ్ళీ నాకు కాని, నా వాళ్ళకు కాని, ఏమైనా జరిగితే డీజీపీ దే బాధ్యత అంటాడు. ఏ విషయంలోనూ క్లారిటీ లేని, పవన్, చివరకు ఇలాంటి విషయాల్లో కూడా ఏమి మాట్లాడతాడో అర్ధం కాదు.

pk 24112018 2

వారం క్రితం, అర్ధాంతరంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని, ముంబైలో ఉన్న కేటీఆర్ ను కలవటానికి, రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే సమయంలో, తన సెక్యూరిటీ వాహనం వెళ్లి ఒక లారీని గుద్దింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, సెక్యూరిటీ వాహనం వెళ్లి, లారీని గుద్దింది. లారీ వచ్చి వీళ్ళను గుద్ద లేదు. అలాగే, హైదరాబాద్ లో మనోహర్ ప్రయనిస్తున్న్ కార్ ని, ఎదో లారీ గుద్దింది. హైదరాబాద్ లో పవన్ కి ఎంతో ఇష్టమైన కేసీఆర్ సర్కార్ ఉంది. ఈ రెండు సంఘటనలు, తనను చంపటానికే అని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నారు. మరి, అలాంటప్పుడు కేసు ఎందుకు పెట్టలేదు ? జగన్ లాగా ఏపి పోలీసులు పై నమ్మకం లేదు అనుకుందాం, మరి హైదరాబాద్ లో, మీ కేసీఆర్ పరిపాలనే కదా, అక్కడ ఎందుకు కేసు పెట్టలేదు ?

pk 24112018 3

ఇవేమీ చెయ్యకుండా, కేవలం చంద్రబాబు నన్ను చంపేస్తున్నాడు అంటే ఎలా ? రోడ్డు మీద రోజుకి వంద ఆక్సిడెంట్ లు అవుతాయి. పవన్ కాన్వాయ్ లో ఉండే పిల్ల డ్రైవర్ ల వల్ల, ఎప్పుడూ ఎదో ఒక ఆక్సిడెంట్ అవుతుంది. దానికి చంద్రబాబుని అంటే ఎలా ? మళ్ళీ కోడి కత్తి దాడిలో చంద్రబాబు స్పందించారు, నా పై దాడి జరిగితే స్పందించలేదు అనటం ఏంటి ? అసలు నీ పై దాడి ఎక్కడ జరిగింది ? నీ సెక్యూరిటీ వాహనం వెళ్లి లారిని గుద్దితే, అది నీకు జరిగిన దాడి అని నువ్వు అనేసుకుని, దాని పై చంద్రబాబు స్పందించాలి అని కోరుకోవటం ఏంటి ? నువ్వు చేసే ఆక్సిడెంట్ లకి డీజీపీ బాధ్యత వచించటం ఏంటి ? దేశంలో ఏది జరిగినా, నా గురించే చేశారు అనుకోవటానికి, నువ్వు ఏమన్నా పెద్ద రాజకీయ నాయకుడివా ? కనీసం పంచాయితీ వార్డ్ మెంబెర్ గా కూడా గెలవని చరిత్ర నీది.. కొంచెం వాస్తవాల్లో బ్రతుకు పవన్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read