కేంద్రంతో ఎలా పోరాడాలో నేను చూపిస్తా అని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం రాజీనామా చేసి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ రైల్వేజోన్‌ సాధన కోసం నాతో కలిసి పోరాడాలని, అప్పుడు నేను వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయాలని కోరతా అని, మీరందరూ నేను చెప్పినట్టు వింటే కేంద్రం దిగి వస్తుంది అని, పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని తగరపువలస అంబేడ్కర్‌ కూడలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాజీనామా చేసి, నాలాగా కేంద్రం పై పోరాడాలని పిలుపు ఇచ్చారు. నాకు మోడీ అంటే భయమే లేదని, అందుకే మోడీ పై అందరికంటే గట్టిగా పోరాడుతుంది, నేను మాత్రమే అని పవన్ అన్నారు.

pk 07072018 2

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన రైల్వే జోన్‌ను సాధించేందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిని ఎదిరించేందుకు తను ముందుకొస్తుండగా, తెలుగుదేశం, చంద్రబాబు కేంద్రంతో పోరాడకుండా పారిపోతున్నారని పవన్ అన్నారు. చంద్రబాబు మోదీని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తనకు మోదీ అంటే భయం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, విభజన హామీలు అమలు చెయ్యాలని, ప్రతి రొజూ అడుగుతున్నది, పోరాడుతుంది జనసేన మాత్రమేనని పవన్‌ చెప్పారు.

pk 07072018 3

మొత్తానికి నిన్న విశాఖలో పవన్ కళ్యాణ్ కామెడీ పండించారు.. స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్టు చదువుతూ, ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కాకుండా, మాట్లాడేసారు. పవన్ కళ్యాణ్ నోటి వెంట మోడీ అనే మాట వచ్చి, కొన్ని నెలలు అయ్యింది. అలాంటి పవన్, ప్రతి రోజు కేంద్రంతో పోరాటం చేస్తున్నారంట. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి, దేశం మొత్తం చూస్తూ ఉండగా, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా, మోడీ మోసం ఎండగడితే, పార్లమెంట్ లో తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చించే దమ్ము లేక మోడి పారిపోతే, ఇలాంటి చంద్రబాబుని, నువ్వు భయపడుతున్నావ్, పోరాటం ఎలా చెయ్యాలో నేను చూపిస్తా రా అంటున్నాడు. అది కూడా రాజీనామా చేసి రావాలి అంట... రాష్ట్రంలో సంవత్సరం పాటు, అందరూ రాజీనామాలు చేసి కూర్చుంటే, రాష్ట్రం నాశనం అవ్వాలనే, ప్లాన్ లో ఇది ఒక భాగం కాబోలు... పాపం పవన్ మాత్రం ఏమి చేస్తాడు.. అంతా అమిత్ షా మాయ...

Advertisements

Advertisements

Latest Articles

Most Read