పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట, ఎదో సినిమా డైలాగ్లులాగా ఉంటాయి. అప్పటికప్పుడు, తన ఫాన్స్ ని రంజింప చేసామా అనేలా ఉంటాయి కాని, ఎక్కడా రియాలిటీకి దగ్గరగా ఉండవు. ప్రతి సందర్భం, తన జీవితంలో జరిగింది అంటూ కధ అల్లేస్తూ ఉంటారు. వాళ్ళ ఫాన్స్ అదే నిజం అనుకుని, ఊహా లోకంలో విహరిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజగా, ఏకంగా అంబానీని ఆంధ్రాకు పిలిపించి గ్యాస్ సంగతి తెల్చేస్తా అంటూ ప్రకటన చేసారు. తాను సియం అవ్వగానే, అంబానీలను రాష్ట్రానికి పిలిచి కోనసీమకు అండగా ఉండాలని కోరతానని అన్నారు.
అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో సోమవారం జరిగిన రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన వివిధ అంశాలపై తన విజ్ఞాన ప్రదర్సన చేసారు. మిగతా పార్టీల్లా పార్టీఫండ్ ఇస్తే లొంగిపోయే పార్టీ జనసేన కాదని, ఇక్కడ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రకృతి వనరులను దోచుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. సియం అవ్వగానే, అంబానీని ఆంధ్రాకు పిలిపిస్తా అని, ఆయనతో అన్నీ మాట్లాడతానని అన్నారు. నాకు వీళ్ళ నుంచి పార్టీ ఫండ్ అవసరం లేదు, వాళ్ళ సంగతి నేను చూస్తా అని పవన్ అన్నారు.
అవినీతి, దోపిడీని అరికట్టాలని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. రైతుల కష్టాలను తీర్చడం లో జనసేన అగ్రతాంబూలం ఇస్తుందన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడటానికి ఇక్కడకు రాలేదని, వినడానికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. తానూ రెండు సెంట్లలో వరి పందిస్తున్నా అని చెప్పగానే, రైతులు అవాక్కయ్యారు. రెండు సెంట్లలో వరి పండించటం ఏంటో అని బుర్ర గోక్కున్నారు. ఇక్కడే పవన్ ఎంత నిజాయతీగా మాట్లాడుతున్నారో తెలిసిపోతుందని అనుకుంటున్నారు. ఏదేమైనా, అంబానీని ఆంధ్రాకు పిలిపించి తెల్చేస్తా అని పవన్ చెప్తుంటే, కేఏ పాల్ ట్రంప్ తో మాట్లాడి, ఏపికి పెట్టుబడులు తెస్తా అని చెప్పినట్టే ఉంది. బెస్ట్ అఫ్ లక్ పవన్..