అప్పుడెప్పుడో మనోడు బాగా ఎమోషన్ లో ఉన్న టైంలో, నాకు తెలంగాణా అంటే ప్రాణం, నా గుండెకాయి, నేను తెలంగాణా నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పారు పవన్. తరువాత, అనంతపురం వెళ్లారు, గాల్లో పిడిగుద్దులు గుద్ది, నేను అనంతపురం నుంచి పోటీ చేస్తున్నా అన్నారు. తరువాత అరకులో రెండు రోజులు ఫోటో షూట్ చేసి, నేను పాడేరు నుంచి పోటీ చేస్తున్నా అన్నారు. తీరా చూస్తే అది ఎస్సి రిజర్వడ్ సీట్. అది అయిపోయిన తరువాత అనకాపల్లి వచ్చి, జుట్టు పైకి ఎగరేసి, నేను అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నా అని సెలవిచ్చారు.. మొన్న తిరుపతి అన్నారు. ఇప్పుడు పిఠాపురం వంతు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను చాలా మంది పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు సెలవిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రీపాద వల్లభుడంటే తనకెంతో ఇష్టం, ప్రేమ, గౌరవమని.. ఆయన ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీచేస్తానేమో అని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని భగవంతుడి ఆజ్ఞే అయితే అప్పుడు చూద్దామన్నారు. పవన్ ప్రకటనతో, జనసైనికులు నాగినీ డాన్స్ వేస్తున్నారు. పిఠాపురం అయితే పవన్ సామాజిక వర్గం అధికంగా ఉంటుందని, పవన్ గెలుపు చాలా సునాయాసం అవుతుందని అంటున్నారు. ఇంతకు ముందు తెలంగాణా, అనంతపురం, పాడేరు, అనకాపాల్లి, తిరుపతి అయితే చాలా కష్టం అని ఆలోచిస్తున్నామని, పిఠాపురం అయితే కుమ్మేస్తాం అని అంటున్నారు.
పవన్ మాట్లాడుతూ "జనసైనికులు చాలా జాగ్రత్తగా ఉండండి, దాడులు జరిగే అవకాశం ఉంది, సంయమనం పాటించండి, అవసరమైన రోజు నేనే చెప్తాను ఆరోజు సైలెన్సర్ పీకుతారో ఏం పీకుతారో మీ ఇష్టం. నేను ఎంతో సంయమనం పాటిస్తాను, శాంతంగా ఉంటాను, తప్పుడు మాటలు మాట్లాడను. ఎవడు ఎవరితో రంకు చేసినా జనసేన దే బాధ్యత అంటే ఎలా, మీరు నేను సమస్యలపై మాట్లాడుతుంటే దాన్ని పక్కదారి పట్టించటానికి ఏదొకటి చేస్తే ఎలా. నాకు ఆడపడుచుల మీద అపారమైన అభిమానం ఉంది. నేను వచ్చింది మీ భవిష్యత్తు కోసం, మీ జీవితాల కోసం, మీ ఆనందం కోసం, మీకు నాకు మధ్య రెండు గుండెలు మాత్రమే దూరం' అని ఈ రోజు స్క్రిప్ట్ అంతా పవన్ చదివేశారు.