నిన్న పవన్ కళ్యాణ్ , కెసిఆర్ ని కలవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. మొన్నటి దాకా తిట్టుకుని ఇప్పుడు కెసిఆర్ ని పొగడటాన్నీ తప్పు పట్టటానికి లేదు. ఎవరి రాజకీయ ప్రయోజనం వారిది... ఇక్కడ వరకు పరవాలేదు.. కానీ , ఆంధ్రప్రదేశ్ లో సమస్యల పరిష్కారానికి, తెలంగాణా నాయకుల స్పూర్తిని తీసుకోవాలి, కెసిఆర్ ఉద్యమం నడిపిన స్పూర్తి తీసుకోవాలి, కెసిఆర్ ఎలా పోరాడాడో ఆంధ్రా వారు ఆదర్శంగా తీసుకోవాలి అనటాన్ని మాత్రం ప్రతి ఆంధ్రుడు తప్పు పడతాం... కేసీఆర్ ని ఆంధ్రపాలకులు ఆదర్శంగా తీసుకోవాలనటం కచ్చితంగా మీ అవివేకమే... ఆయనది నిరంకుశత్వం..! అభిజాత్యం..!అహంకారం..! అలా చంద్రబాబు ఉంటే ముందు మీరే గళం విప్పేస్తారు.. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, కెసిఆర్ ఉద్యమ సమయంలో సీమంధ్ర ప్రజలని ఎలా తిట్టాడో, ఆ బాధలో 11 రోజులు అన్నం మానేసాను అని చెప్పిన పవన్, ఇవాళ కెసిఆర్ నుంచి ఆంధ్రా వాళ్ళు స్పూర్తిని తీసుకోవాలి అనటం, ఆయన అవగానా రాహిత్యం... అయినా తెలంగాణా సోనియా ఇచ్చింది రాజకీయ ప్రయోజనం కోసం అని అందరికీ తెలిసిందే...
బహుశా ఆంధ్రుల ఉద్యమ స్ఫూర్తి గురించి సరైన అవగాహన పవన్ కు లేక అలా చెప్పారేమో. పవన్ నేను ఎన్నో పుస్తకాలు చదువుతాను అని చెప్తారు, ఆంధ్రుల పోరాటాలు గురించి ఎక్కడా చదవలేదు ఏమో... ఆంధ్రులకు ఆంధ్రులే స్ఫూర్తి... తెలంగాణ కన్నా యాభై ఏళ్ళ ముందే అప్పటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి , ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న విజయం ఆంధ్రులది. అంతకన్నా ముందే తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతు పలికి తెలంగాణ సోదరులకు బాసటగా నిలిచిన ధైర్యం ఆంధ్రులది... తెలంగాణ సాయుధ పోరాటాన్నే ముందుండి నడిపించింది ఆంధ్రులే... వైజాగ్ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పట్టబట్టి తెచ్చుకున్న ఉక్కుసంకల్పం ఆంధ్రులది...
అంతెందుకు, ఇప్పుడు జరుగుతున్న విషయం....రాజధాని కూడా లేకుండా ఏర్పడిన రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాల సరసన నిలబెట్టిన దమ్ము ఆంధ్రులది. ఉద్యమం మనకు చిటికెలో పని, కానీ దాని కన్నా ముందు దేన్నైనా సొంతగా సాధించి చూపే తత్వం మన ఆంధ్రులది... ఉద్యమం కన్నా మనకి అభివృద్ధి ముఖ్యం... అందుకోసమే వేచి చూస్తున్నాం. మనకెవడైనా అన్యాయం చెయ్యాలని చూస్తే, ఒక్క చూపు చూస్తే చాలు బూడిదై బంగాళాఖాతంలో తేలుతాడు. మనకు మనమే స్థైర్యం, మనకు మనమే సైన్యం, మనకు మనమే వ్యూహం, మనకు మనమే స్ఫూర్తి, మనకు మనమే దీప్తి. మనల్ని చూసి ప్రపంచమే స్ఫూర్తి పొందుతుంది. పవన్ గారు, రండి జనజీవన స్రవంతిలో కలవండి. ఆంధ్రుల కంటి చూపు చూడండి ఎంత వాడిగా ఉంటుందో !! శ్వాస ఒక్కసారి చూడండి, ఎంత వేడిగా ఉంటుందో !! అంతటి వాడి, వేడి ఉన్నోడిని ఇంకెక్కడా చూడవు, వాడికివాడే సాటి, లేదెక్కడా పోటి. ముంజేతికి మీసాలు మొలిపించగలిగినోడు ఈ ఆంధ్రోడు... మీరు చంద్రబాబుని కలవండి, కెసిఆర్ ని కలవండి, మోడీని కలవండి, జగన్ ను కలవండి, వారిని పొగడండి, తిట్టండి... అది మీ రాజకీయం, మాకు అనవసరం... మా ఆంధ్రులని మాత్రం మీ అవగాహనా రాహిత్యంతో, తక్కువ చేసి చూడకండి... (నోట్: ఆర్టికల్ లో కొంత భాగం, మోహన్ రావిపాటి గారి ఫేస్బుక్ పోస్ట్ నుంచి తీసుకొనబడింది)