నిన్న పవన్ కళ్యాణ్ గవర్నర్ ని కలిసారు. గవర్నర్ జోక్యం చేసుకుని, చంద్రబాబుని పని చేసేలా చెయ్యాలంట. అప్పుడే శ్రీకాకుళంలో తుఫాను బాధితులకు సహాయం అందుతుంది అంట. తను శ్రీకాకుళం పర్యటనకు వెళ్లి, ఒక పుస్తకంలో రాసిన నోట్స్ అంతా, నివేదిక లాగా తయారు చేసి, గవర్నర్ కు ఇచ్చాడు పవన్. సోషల్ మీడియాలో వైరల్ అయిన నోట్స్ లో, బిర్యాని, పార్సెల్, లక్ష అని ఉంది కదా, మరి ఏమి నివేదిక ఇచ్చాడు అంటే, మనకు తెలియదు మరి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, పవన్ తాను చూసింది, రాసుకుంది, నివేదిక ఇచ్చాడు. చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారని, గవర్నర్ జోక్యం చేసుకోకపోతే, అసలు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన జరగదు అని కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు అని పవన్ బయటకు వచ్చి మీడియాతో చెప్పారు.

pk 24102018 2

సరే ప్రతిపక్షం అన్న తరువాత ఇవన్నీ కామన్, వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు. ఎంత చేసినా చెయ్యలేదు అని చెప్పటమే ప్రతిపక్ష నైజం, మన రాష్ట్రంలో ఈ పాళ్ళు కొంచెం ఎక్కువ. అయితే నేను వీరుడిని, ధీరుడిని, ఎవరికీ భయపడను, తాట తీస్తా, తొక్క తీస్తా, కాళ్ళు విరగ్గోడతా, తుపాకీ ఉంది, నక్సల్స్ ఉన్నారు, అంటూ గాల్లో పిడిగుద్దులు గుద్డుతూ ఊగిపోయే పవన్ కళ్యాణ్, తెలంగాణా విషయం వస్తే మాత్రం, ఎందుకో కాని, తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఒక పక్కన ఎన్నికలు జరుగుతున్నా, ఒక్క మాట కూడా తాను ఉండే తెలంగాణా రాష్ట్రం గురించి మాట్లాడటం లేదు. నిన్న చంద్రబాబు గురించి అన్నీ తిట్లు తిట్టిన తరువాత, విలేకరులు అడిగిన రెండు ప్రశ్నలకు ఎంతో ధైర్యంగా సమాధానం దాటవేసాడు పవన్. అవును అండి, దీంట్లో వెటకారం లేదు, పవన్ ఫాన్స్ ఇలాగే చెప్పుకుంటున్నారు.

pk 24102018 3

ఒక విలేఖరి, సార్ శ్రీకాకుళం గురించి, ఇంత బాధపడుతున్నారు, అదే కొండగట్టు ప్రమాదంలో 62 మంది చనిపోయారు, దాని గురించి ఎందుకు ఇంతలా పట్టించుకోలేదు అని ప్రశ్న అడిగింది. పవన్ ఒకసారి ఏంటి వినిపించటం లేదు అంటూ ఉండగానే, పక్క నుంచి నాదెండ్ల మనోహర్, అటు వైపు ఎదో పంచాయతీ ఎన్నికల గురించి ప్రశ్న ఆడుతున్నారు అంటూ చెప్పగానే, పవన్ అటు తిరిగిపోయాడు. మళ్ళీ ఇంకో విలేఖరి, సార్ తెలంగాణా ఎన్నికలలో పోటీ గురించి చెప్పండి అంటే, దానికి ఇంకా టైం చాలా ఉంది, అంటూ వాచ్ చూపించి, నవ్వుతూ ప్రెస్ మీట్ ముగించి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి, చూస్తుంటే పవన్ ఎజెండా ఏంటో ఇట్టే అర్ధమైపోతుంది. https://youtu.be/AYIAwgCyo9Y , 4:58 నుంచి చూడండి

Advertisements

Advertisements

Latest Articles

Most Read