జగన్ అట్టహాసంగా ప్రారంభించిన పాదయాత్ర వాయిదా పడింది.. ఇందుకు సంబంధించి మీడియాకు ఆఫిషియల్ గా చెప్పకపోయినా, ఇప్పటికే జిల్లాల ముఖ్య నేతలకు సమాచారం వెళ్ళింది... ప్రత్యామ్నాయం ఏంటో కూడా చెప్పి, రెడీ అవ్వమన్నాడు ప్రశాంత్ కిషోర్...
ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవతూ పాదయాత్ర చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడి, మనం చేసిన స్కాంలు ప్రజలకి గుర్తు చేస్తూ ఉంటాయని, అందుకే పాదయాత్ర ఆపెయ్యమని ప్రశాంత్ కిషోర్ జగన్ కు సలహా ఇచ్చారు... ఇందుకోసం జోతిష్యులు వాయిదా వెయ్యమన్నారు అనే ప్రచారం ప్లాన్ వేశారు...
మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, పాదయాత్ర లేకపోతే ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అని జగన్, అడిగితే, ప్రశాంత్ కిషోర్ మరో మాష్టర్ ఐడియా ఇచ్చాడు... పాదయాత్ర బదులు జిల్లాల యాత్ర చెయ్యమని సలహా ఇచ్చారు.. జిల్లాల పర్యటన అయితే వారానికి 3-4 రోజులు పెట్టుకుని, శుక్రువరం కోర్ట్ కి పోవచ్చని ప్రశాంత్ కిషోర్ సలహా...
పీకే సలహా మేరకు, వచ్చేనెల నుంచి జిల్లాలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్యనేతలకు సమాచారం పంపారు. వారందరికీ పాదయాత్ర ఉండదని చెప్పకుండా.. అంతకంటే ముందుగా జగన్ జిల్లాల యాత్ర చేస్తారని, ఏర్పాట్లు చూసుకోవాలని సూచనలిస్తున్నారు. ఈ జిల్లాల యాత్రలో జగన్ ఏం చేస్తారన్నాదానిపై వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు.