జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ‘పిడికిలి’ గుర్తుపై ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పిడికిలి గుర్తు ఐక్యతకు చిహ్నం కాదని... తిరుగుబాటుకు చిహ్నమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై ప‌వ‌న్ విషం చిమ్ముతున్నారని జూపూడి తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కావాలనుకునే రాజ‌కీయ‌ నాయ‌కుడికి ఓర్పు, నేర్పు అవసరమని ఆయన అన్నారు. ప‌వ‌న్‌కు మెంటల్ బ్యాలెన్స్ లేద‌ని జ‌నం భావిస్తున్నారని, జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో మీ రంగు బయట పడుతుందని, ప్రజాక్షేత్రంలో సమాదానం చెబుతామని అన్నారు. మొదట్లో కులమత బేధాలు లేవన్న పవన్ ఇప్పుడు తను కాపు కులం అయినందునే చంద్రబాబు నాయుడు గౌరవించారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

pk 14082018 2

వెల‌గ‌పూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ తనకు అప్పగించిన శాఖని సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. తాత ముఖ్యమంత్రిగా చేసినా, తండ్రి ముఖ్యమంత్రి అయినా ఆయన అధికారులతో గానీ, కార్యకర్తలతో గానీ ఎంతో హుందాగా వ్యవహరిస్తారన్నారు. సీఎం అవడానికి ఎందుకు అంత తొందర, మీ తాత ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో సీఎం అయ్యారని పవన్ లోకేష్‌ని అంటున్నారని, అసలు లోకేష్ సీఎం కావాలనుకుంటున్నట్లు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు ఆయనతో కలిసి ఉన్నారు లోకేష్ ఎలాంటివారో మీకు తెలియదా? అని అడిగారు. లోకేష్‌కు సంబంధించి చేస్తున్న వితండవాదాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని టీడిపీ డిమాండ్ చేస్తోందన్నారు. సీఎం పదవి అంటే వడ్డించిన విస్తరికాదని, ఉర్రూతలూగించే ప్రసంగాలు, ఆవేశంతో ఊగిపోవడం కాదన్నారు.

pk 14082018 2

ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి పని చేసిన పవన్ 25 ఏళ్ల సుదీర్ణ ప్రణాళికతో రాజకీయాలలోకి వచ్చినట్లు, తనకు సీఎం కావాలని లేదని చెప్పారన్నారు. ఇప్పుడు చంద్రబాబు, జగన్, పవన్ లలో ఎవరిని సీఎం చేస్తారని అడుగుతున్నారని, ఎవరిని సీఎం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. సమాజంపైన, భారతీయ సంస్కృతిపైన, కుటుంబ వ్యవస్థపైన, పెళ్లిళ్లపైన పవన్‌కు అవగాహన లేదన్నారు. అవగాహన ఉన్న నాయకుడిలా కనిపిస్తారని, అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తుంటారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించడంలేదని అడిగారు. చంద్రబాబు యూ టర్న్ తీసుకోలేదని, మోడీ తీసుకున్నారన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం సందర్భంగా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.

pk 14082018 2

ఆయన అన్న చిరంజీవి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో అర్ధం కావడంలేదన్నారు. విభజన సమయంలో ఆయన ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి నాయకుడుగా ఉన్న పవన్ తన అన్న పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ లో కలిపినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అల్లు అరవింద్ పోటీ అభ్యర్థుల నుంచి పొలాలు, స్థలాలు, ఇళ్లు రాయించుకొని రాజకీయాలను కలుషితం చేశారన్నారు. పవన్ ఒకసారి తనకు 5గురు ఎమ్మెల్యేలు ఉంటే చాలంటారు, అంటే అన్న 18 మంది ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి పదవి చేపట్టినట్లు రుజువు చేయడంతో తను కూడా సీఎం కావచ్చని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆయన మాటలు పొంతనలేని విధంగా ఉంటాయన్నారు. జనసేన ప్రజా రాజ్యం-2గా లేక ఆ పార్టీ అవశేషంగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read