ప్రశాంత్ కిషోర్... ఈయన జగన్ ముఖ్యమంత్రి అవ్వటం కోసం, ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు... ఈ నిమషాన జగన్ ఎవరి మాట అన్నా వింటున్నాడు అంటే అది ప్రశాంత్ కిషోర్ మాటే... ప్రశాంత్ కిషోర్ తీసుకునే నిర్ణయాలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువు జరుగుతుందని వైసీపీ నేతలు వాదిస్తున్నా, జగన్ మాత్రం ఆయన్ని వదలటం లేదు... ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం, ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేలతో సమావేశం అవ్వటం చర్చనీయంసం అయ్యింది. స్థానిక వైసిపి నాయకులని కాదు అని, ప్రశాంత్ కిషోర్ టీం తెలుగుదేశం వాళ్ళ దగ్గరకి వెళ్ళటం వైసిపి నాయకులకి కూడా కోపం తెప్పించింది..
వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లలో బూచేపల్లి కుటుంబం వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించి వైసీపీకి షాక్ ఇచ్చింది. అది పుడ్చుకోవటానికి ఏకంగా తెలుగుదేశం ఎమ్మల్యేనే కలిసింది ప్రశాంత్ కిషోర్ టీం. ప్రకాశం జిల్లా టీడీపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో పలువురు నేతలు ప్రత్యర్థి పక్షం వైపు చూస్తున్నట్లు అనుమానాలు రావటంతో ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది.. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కలిసి అనేక అంశాలపై ముచ్చటించారు. వైసిపిలోకి రావాలి అని కూడా అడిగారు...
అయితే వారి నుంచి సరైన స్పందన రాకపోవటంతో, ప్రశాంత్ కిషోర్ టీం వెనుదిరిగినట్టు సమాచారం. ఆ ఎమ్మల్యేలని కలిసే ముందు, టీడీపీలోని కొందరు నాయకులను వైసీపీలోకి రాబట్టుకుంటే ఒనగూరే ప్రయోజనాలపైపీకే బృందం సర్వే చేసుకుని మరీ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది... అయితే, ఈ పరిణామంతో అందరూ అవాక్కయ్యారు... సలహాదారులని, వ్యూహకర్తలని ఇలా కూడా వాడుకుంటారా అని ఆశ్చర్యపోయారు... అవతలి వారు ఎమ్మల్యేలు అన్న విషయం కూడా మర్చిపోయి, ప్రశాంత్ కిషోర్ టీంలో వాళ్ళని పంపటం ఏంటి అని ఆశ్చర్యపోయారు... ఎదో ప్రచారానికి ఇలాంటి వారని ఉపయోగించుకోవటం చూసాం కాని, ఇలా ఏకంగా రాజకీయ చర్చలు కోసం కూడా జగన్ వీళ్ళని వాడటం చూస్తుంటే, ఆయనకు తన సొంత పార్టీ నాయకుల పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది అని అంటున్నారు... మరో వైపు టిడిపి అధిష్టానం, ఈ పరిణామాల పై ఆరా తీస్తుంది...