గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు ఇంటికి శనివారం వైసీపీకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వచ్చారు. కొందరు ఇంట్లోకి వెళ్లి.. తమ పార్టీలో చేరాలంటూ చర్చించారు. ఆ నాయకుడు ససేమిరా అన్నారు. వెంట వచ్చిన కార్యకర్తలు ఇంటి ముందు చాలాసేపు వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు జెండాలతో ఉన్న వైసీపీ నాయకుల ఫొటోలు, ఆయనను కలిసిన ఫొటోలు జోడించి పార్టీ మారాడంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగులు చేశారు. దీంతో ఆ నాయకుడు సొంత పార్టీకి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇదో మైండ్‌ గేమ్‌. నాయకుల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఓటర్లను అయోమయానికి గురిచేసే ఆట..! ఇందుకు మీడియా, సోషల్‌ మీడియా ఆయుధాలు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ముఖ్యనాయకులు తమ కార్యక్రమాలు చిత్రీకరించేందుకు సొంతగా కెమెరామెన్లను నియమించుకున్నారు.

game 27032019

అనుచరగణం ఎలాగూ వెంటుంటారు. వీరు ప్రచారంలో నాయకుల వెంట తిరుగుతూ కొత్త ఆలోచనలతో ఓటర్లను ఆయోమయంలో పడేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులు తమ పార్టీలోకి చేరారంటూ భ్రమ కలిగిస్తూ అసత్య, అర్థసత్యాలతో కూడిన ప్రచారం చేస్తున్నారు. తమ నాయకుడి వద్దకు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు వచ్చినా క్లిక్‌ మనిపించడం.. వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి తప్పుడు ప్రచారం చేయడం ఇటీవల రివాజుగా మారింది. గుంటూరు శివారు ప్రాంతంలోని ఓటర్లకు, నాయకులకు బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలోకి ఇటీవల చెరిన ఓ ’అన్న’ తన బలగంతో రాత్రివేళ్లలో బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. కాస్త పలుకుబడి ఉండి.. నాలుగు ఓట్లు వేయించగలిగిన వ్యక్తులను బెదిరించడం, ప్రతిపక్ష పార్టీకి సహకరించాలని ఒత్తిడి తేవడంపై ఫిర్యాదులు వస్తున్నాయి.

game 27032019

అంతా అన్న చూసుకుంటాడు.. మీరు మాకు పనిచేయాలనంటూ చోటామోటా నాయకులపై హుకుం జారీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులే పల్నాడు ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాలోను ఉంది. దిగువస్థాయి నాయకుల్ని ప్రలోభ పెడుతూ, బెదిరింపులకు పాల్పడుతూ ప్రత్యేకంగా ఓ ముఠా తిరుగుతోంది. గ్రామాల్లో పట్టున్న వారిని, అధికారులను హెచరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘గ్రామాల బాధ్యత మీకు అప్పగిస్తాం. ఎంత కావాలో చెప్పండి. ఏం కావాలో అడగండి. ఆ బూత్‌లతో మాకు మెజార్టీ రావాల్సిందే’నంటూ ముందు మర్యాదగా, తర్వాత బెదిరింపుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ప్రత్యర్థి పార్టీలోకి మారొద్దు... అంతర్గతంగా మాకు సహకరించాలి. మీ వైపు ఉన్న ఓట్లన్నీ మాకు పడేలా చూడండి. కావాల్సింది మేం చూసుకుంటాం’ అంటూ సంకేతాలు ఇస్తున్నారు. టిక్కెట్‌ కోసం ప్రయత్నించి విఫలమైన వారికి ఇలాంటి నజరానాలు ఎక్కువగా వస్తున్నాయి. నిరాశావాదులు ఎవరికీ తెలియకుండానే సమావేశాలు పెట్టి... ప్రత్యర్థి పార్టీలకు సహకరించేఆలా తమ వారికి సంకేతాలు ఇస్తున్నారు. వారికి వచ్చే ఆఫర్లను చెబుతూ.. ఈసారి వారికి పనిచేస్తే వచ్చే లాభాలను వివరిస్తున్నారు. ఈ కోవర్టు ఆపరేన్లు భారీగా జరుగుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read