జగనసేన అధినేత పవన్ కళ్యాణ్, హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క విస్తృత స్థాయి సమావేశం జరుగుతూ ఉండగానే, మధ్యలోనే లెగిసి, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిపోయారు. ఈ రోజు గుంటూరు జిల్లాలోని, మంగళగిరిలోని, జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో, పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గున్నారు. ఈ సమావేశం జరుగుతూ ఉండగానే, ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అయితే, పవన్ కళ్యాణ్ ఇంత హడావిడిగా ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అనేది మాత్రం, జనసేన పార్టీ వర్గాలు చెప్పటం లేదు. అక్కడ ఎవరిని కలుస్తారు ? ఏ విషయం పై కలుస్తారు అనేది మాత్రం, అధికారికంగా చెప్పలేదు. నెల క్రితం కూడా, పవన్ కళ్యాణ్, ఇలాగే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఎవరిని కలిసింది మాత్రం, ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయన బీజేపీ అగ్ర నేతలను కలుస్తున్నారని తెలుస్తున్నా, అది ఏ విషయంలో కలుస్తున్నారు ? రాజకీయంగా కాలుస్తున్నారా ? లేక రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వివరించటానికి కాలుస్తున్నారా అనేది మాత్రం తెలియదు.
అయితే, నిన్న, ఈ రోజు, పవన్ కళ్యాణ్ రాజధాని తరలింపు విషయం పై, పార్టీలో చర్చిస్తున్నారు. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం పై, మాట్లాడుతున్నారు. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం పై, వచ్చే వారం, విజయవాడలో పెద్ద కవాతు కూడా చేస్తారాని, ఆ విషయం పై, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అలాగే నిన్న కూడా కొంత మంది అమరావతి రైతులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. గత వారం రోజులుగా, పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై, పవన్ కళ్యాణ్ కు వివరించారు. మహిళలను టార్గెట్ చేసి మరీ, పోలీసులు కొడుతున్నారని, పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసారు. ఈ విషయం పై, తమతో, కలిసి రోజు వారీ పోరాటాలు చెయ్యాలని పవన్ ని కోరారు.
ఇక అలాగే కేంద్రం కూడా ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలని, పవన్ కోరుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయని, వెంటనే కేంద్రం కూడా కలగచేసుకోవాలని పవన్ కోరుతున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇంత హడావిడిగా ఢిల్లీ వెళ్ళరా అనేది తెలియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రముఖుల అపాయింట్‌మెంట్ పవన్ కల్యాణ్‌కు ఖరారయిందని అందుకే వెళ్లారని తెలుస్తున్నా, ఏ విషయంలో పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు అనేది మాత్రం, తెలియదు. ఈ సారైనా, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన పై పూర్తి వివరాలు తెలుస్తాయా , లేకపోతే, పోయిన సారి ఢిల్లీ పర్యటన లాగా, ఈ సారి కూడా, పర్యటన గోప్యంగా ఉంటుందో తెలియదు. ప్రజా సమస్యల పై ఢిల్లీ పర్యటన అయితే, గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారో, జనసేన వర్గాలే చెప్పాలి.