కొంతకాలంగా బీహార్ సీఎం నితీష్ కుమార్,ఐప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ మధ్య వివాదం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే.అనేక సందర్భాల్లో సీఎం నితీష్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియా తో మాట్లాడటం,తన సొంత నిర్ణయాలను పార్టీ నిర్ణయాలగా ప్రకటిస్తూ ప్రశాంత్ కిషోర్ నితీష్ కి కొరకరాని కొయ్యగా మారారు.బీజేపీ కింగ్ పిన్ అమిత్ షా ఆదేశాలతో ప్రశాంత్ కిషోర్ ని పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించిన నాటినుండి నితీష్ కి కంటి మీద కునుకు లేకుండా చేసారు ప్రశాంత్ కిషోర్.ముఖ్యమంత్రి గా ఆయన చేస్తున్న తప్పులను ఎత్తి చూపారు.పార్టీ లో కూడా నితీష్ ని కాదని తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇప్పుడు ఆ వివాదం తారా స్థాయికి చేరుకుంది.బీజేపీ తీసుకొచ్చిన సిఏఏ,ఎన్ఆర్సి,ఎన్పిఆర్ సిసిఏ బిల్లుల వ్యవహారంలో నితీష్ ,ప్రశాంత్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండే వాతావరణం తీసుకొచ్చాయి.రోజుకో ట్వీట్ తో నితీష్ ని ఇబ్బంది పెట్టారు కిషోర్.
రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాం అని గమనించిన నితీష్ అసలు నిజాలు బయటపెట్టారు.అమిత్ షా ఆదేశాలతోనే ప్రశాంత్ కిషోర్ ని పార్టీ ఉపాధ్యక్షుడిని చేసా,పార్టీ ని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చారు.పార్టీ లైన్ దాటాలి అనుకుంటే పదవికి రాజీనామా చెయ్యాలి అని అన్నారు.అయితే నితీష్ ని మరింత రెచ్చగొట్టే విధంగా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసారు.ఇక ప్రశాంత్ కిషోర్ ని పదవి నుండి తప్పించి ఆయన పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చెయ్యాలని నితీష్ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమాచారం తెలుసుకున్న జగన్ వెంటనే ప్రశాంత్ కిషోర్ తో ఫోన్లో మాట్లాడారు. నేను మీకు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మీకు పదవి ఇస్తా అని ప్రశాంత్ కిషోర్ కి జగన్ అఫర్ చేశారట.
అంతే కాదు ప్రస్తుతం ఢిల్లీ లో వ్యవహారాలు చక్కబెడుతున్న విజయసాయి రెడ్డి అనేక కేసుల్లో నిందితుడుగా ఉండటంతో జగన్ కి ముఖ్యుల అపాయింట్మెంట్ రావడం కష్టం అవుతుంది అందుకే ప్రశాంత్ కిషోర్ కి క్యాబినెట్ ర్యాంక్ తో పాటు ఢిల్లీ లో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ చేసారట.ప్రశాంత్ కిషోర్ కి బీజీపీ అధినాయకత్వం ఆశీస్సులు ఉన్నాయి.కాబట్టి ఢిల్లీ పెద్దల నుండి కావాల్సిన సహాయం కూడా వెంటనే దక్కుతుంది అలానే రాష్ట్రంలో తనకి అడ్డుగా మారిన మండలి రద్దు కు కూడా ప్రశాంత్ కిషోర్ మార్గం సుగమం చేస్తారు అని జగన్ బలంగా నమ్మి ప్రశాంత్ కిషోర్ ని మరో సారి పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలి అని డిసైడ్ అయ్యారు అట.ప్రశాంత్ కిషోర్ కూడా ముఖ్యమంత్రి జగన్ అఫర్ కి అంగీకరించినట్టు సమాచారం.వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు తీసుకోవడం ఇక లాంఛనమే అంటున్నారు పార్టీ వర్గాలు.పూర్తి స్థాయిలో పీకే బాధ్యతలు స్వీకరిస్తే ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పీకే మార్క్ సినిమా కనిపిస్తుంది అని వైఎస్ఆర్సి వర్గాలు అంటున్నాయి