జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నారు. పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, పలువురు జనసేన ప్రతినిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు కూడా లక్నోకు వెళ్లారు. బీఎస్పీ అధినేత మాయావతితో భేటీ అయ్యేందుకే పవన్ కల్యాణ్ యూపీ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రత్యెక హోదా కోసమో, లేకపోతే మోడీతో పోరాటం కోసమో అనుకునేరు, అదేమీ కాదులేండి, మనోడు రాజకీయం చెయ్యటానికి వెళ్ళాడు. మొన్నా మధ్య, నువ్వు అవిశ్వాసం పెట్టు చంద్రబాబు, నేను దేశమంతా తిరిగి మద్దతు తెస్తా అని చెప్పి, ఇంట్లో కూర్చున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు మాత్రం, ఎదో రాష్ట్రానికి సేవ చేసే భాగంలో దేశ పర్యటన చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాడు.
అసలు పవన్ ఎందుకు అక్కడకు వెళ్ళాడు అంటే, జనసేన చెప్తున్న కారణం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరు వినిపిస్తుండడంతో భవిషత్ రాజకీయాలపై జాతీయ నాయకులతో చర్చించాలని పవన్ అక్కడకు వెళ్లినట్టు చెప్తున్నారు. మాయవాతే కాక, లక్నోలో పలు పార్టీల ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గుంటారని చెప్తున్నారు. అయితే, అసలు వ్యూహం మాత్రం వేరు. ఇప్పటికే ఎస్సీల పార్టీగా ముద్రపడ్డ బీఎస్పీ, ఏపి ఎన్నికల్లో పాల్గుంది కూడా. అయితే ఇప్పుడు కాపు, ఎస్సీ వోటు బ్యాంక్ కలిసేలా బీజేపీ వ్యూహం పన్నుతుంది. అందులో భగంగానే పవన్, ఇప్పుడు లుక్నో వెళ్ళాడు. నిన్న గవర్నర్ ను కలిసి, బీజేపీ నుంచి వచ్చిన తదుపరి ఆదేశాలతో, ఈ స్టెప్ తీసుకున్నాడు.
బీఎస్పీ నేతలను కలిసి, అవసరం అయితే వారితో పొత్తు పెట్టుకుని, రాష్ట్రంలోని ఎస్సీలను పవన్ వైపు తిప్పుకునేలా ఐడియా వేసింది బీజేపీ. ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో, మాయావతి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా చూస్తున్నాం. మరో పక్క 'దళిత - కాపు ఐక్య వేదిక' పేరుతో అంబేద్కర్ మనవడు, ప్రకాష్ అంబేద్కర్, ముఖ్య అతిధిగా, కాకినాడలో ఒక మీటింగ్ ప్లాన్ చేసారు, మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ మీటింగ్ లో జనసేన కూడా కీలకంగా వ్యవహరించనుంది. ఇవన్నీ చూస్తుంటే, కాపు + ఎస్సీ ఓటు బ్యాంకుతో ఎన్నికలకు వెళ్ళాలని పవన్, బీజేపీ వ్యూహంగా ఉంది. అయితే ఈ పరిణామాలతో జగన్ మాత్రం ఉలిక్కి పడుతున్నాడు. ఎందుకంటే ఎస్సీ ఓటు బ్యాంకు ప్రధానంగా జగన్ కు ఉంది. ఆ ఓటు బ్యాంకు మొత్తం పొతే, అది జగనే కు పెద్ద దెబ్బ అవుతుంది. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి మరింతగా లబ్ధి చేకూరనుంది.