సుదీర్ఘ విరామం తరువాత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మళ్ళీ రాజకీయంగా ఆక్టివ్ అవుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికలకు ముందు కూడా పవన్ పెద్దగా ఆక్టివ్ గా లేరు అనే చెప్పాలి. ఉప ఎన్నికల్లో ఆయన ఒక మీటింగ్ లో పాల్గున్నారు అంతే. ఆ తరువాత ఆయనకు క-రో-నా రావటంతో, ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు. అయితే ఇక్కడ మరో అంశం ఏమిటి అంటే, జరిగే విషయాల పై ఆయన పేరుతో పార్టీ ప్రెస్ నోట్ లు కానీ, ట్వీట్ లు కానీ వస్తూ ఉండేవి, అయితే గత రెండు నెలలుగా అవి కూడా ఆగిపోవటం చర్చనీయంసం అయ్యింది. ప్రభుత్వం అవలభిస్తున్న విధానాలు, పన్ను పెంపు, జాబ్ క్యాలెండర్, పోలవరం అంశం, ఇలా అనేక అంశాల పై పవన్ వైపు నుంచి స్పందన రాలేదు. అయితే ఇక గత నెల రోజులుగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతున్నారు అంటూ ప్రచారం సాగింది. వీటి అన్నిటి నేపధ్యంలో, ఎట్టకేలక పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయంగా ఆక్టివ్ అవుతున్నారు. ఏడవ తేదీన పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో భేటీ అవనున్నారు. రాజకీయ పరిణామాలతో పాటుగా, ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యల పై ఆయన చర్చించనున్నారు. ముఖ్యంగా యువత అంతా జాబ్ క్యాలండర్ పై ఆగ్రహంగా ఉండటంతో, అది ప్రధానాంశంగా తీసుకోనున్నారు.
ఆరవ తారిఖు రాత్రి పవన్ కళ్యాణ్ హైదరబాద్ నుంచి విజయవాడ చేరుకుంటారు. ఏడవ తేదీ ఉదయం మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయానికి చేరుకుని, ఆ రోజంతా ఆయన పార్టీ కార్యాలయంలోనే, అనేక అంశాల పై చర్చిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉదయం ముఖ్య నాయకులతో భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. ప్రభుత్వ విధానాలు, అలాగే ఎలా వివిధ జిల్లాల్లో ఉద్యమాలు చేయాలి అనేది ప్లాన్ చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం ప్రత్యేకంగా నిరుద్యోగ యువతతో భేటీ అయ్యి, గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అమలు అవుతున్న వాటి గురించి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుని, జనసేన స్టాండ్ తో పాటు, భవిష్యత్తు కార్యాచరణ ఈ జాబ్ క్యాలండర్ విషయంలో ప్రకటిస్తారని తెలుస్తుంది. దీంతో, పవన్ భేటీ కంటే ముందు, ఈ రోజు నాదెండ్ల మనోహర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపి, పవన్ కళ్యాణ్ తో చర్చించాల్సిన అంశాల గురించి, ముఖ్య నేతల అభిప్రాయం తీసుకోనున్నారు.