అవును ఇది సంచలనమే... కేఏ పాల్, పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడిన సంచాలనమే. ఎందుకంటే ఒకాయిన మద్దతు ఉంటేనే, ఆయన పిలుపు ఇస్తేనే అమెరికా అధ్యక్షడిగా ఎంపిక అవుతాడు. ఇంకో ఆయన పిలుపు ఇస్తే, రాష్ట్రాలకు సియంలు, దేశానికి పియంలు అవుతారు. ఈ ఇద్దరూ ఒక్క పిలుపు ఇస్తే చాలు, 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉన్నవాళ్ళు కూడా చిన్నబోవాల్సిందే. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత అనుభవం ఉన్నా, కేఏ పాల్, పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపు చాలు, వారి గెలుపు తారు మారు చెయ్యటానికి. నవ్వుకోకండి, ఇది నిజం అని కేఏ పాల్ అభిమానులు, పవన్ అభిమానులు నమ్ముతున్నారు. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు అయ్యింది కేఏ పాల్ ప్రచారం చెయ్యటం వల్ల , ఇక్కడ చంద్రబాబు సియం అయ్యింది, అక్కడ మోడీ పియం అయ్యింది పవన్ ప్రచారం వల్ల.
అందుకే ఇప్పుడు పవన్ చేసిన ట్వీట్ తో, అటు కేసీఆర్, ఇటు ప్రజా కూటమి నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5 న పవన్ ఎటు వైపు మొగ్గుతారా, ఆయన మా గురించి ఒక్క ట్వీట్ చేస్తే చాలు, మేము సియం అయిపోతాం అని అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతెవ్వరికన్న విషయంపై ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై తాజాగా పవన్ ట్విట్టర్‌లో స్పందించారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని ఎన్నికలకు రెండ్రోజుల ముందు అనగా డిసెంబర్ 5వ తారీఖున తెలియపరుస్తామన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎవరికీ మద్దతు తెలిపి ట్వీట్ చేస్తే, వారే గెలుపు అని జన సైనికులు అంటున్నారు.
పవన్ ట్వీట్ ఇదీ.. " తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియపరుస్తాము" అని పవన్ ట్వీట్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎల్లుండి ఏ ప్రకటన చేస్తారా..? అని అభిమానులు, కార్యకర్తలు.. తెలంగాణ రాజకీయ పార్టీల్లో సర్వాత్రా ఆసక్తి నెలకొంది. మరో పక్క పవన్ , ఇప్పటికే కేసీఆర్ పాలనని మెచ్చుకున్నారు. కేసీఆర్ కు మార్కులు కూడా వేసారు. చంద్రబాబు వేస్ట్ అని తేల్చేసారు. ఇక కేటీఆర్ తో అయితే, పవన్ కు ఉన్న సంబంధాలు అన్నీ ఇన్నీ కాదు. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు లీడ్ చేస్తున్న ప్రజా కూటమికి కాకుండా, కేసీఆర్ కే పవన్ మద్దతు ఇచ్చే అవకాసం ఉంది.