రాష్ట్రంలో రాజకీయం చెయ్యలేక, బీహార్ నుంచి అరువు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ముఖ్యంగా కుల గొడవలు పెట్టటం, ఫేక్ న్యూస్ వ్యాప్తి చెయ్యటం, అనుమానాలు వచ్చేలా చెయ్యటంతో, ఈ బీహారీ బాబు దిట్ట.. బీహార్ లో ఏ విధంగా అయితే ఇది వరకు కుల గొడవలు పెట్టి, రాజకీయ లబ్ది పొందే వారో, అదే స్ట్రాటజీ ఇక్కడ మన రాష్ట్రంలో ప్రయోగించాలని, ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు ప్రశాంత్ కిషోర్. మొన్నటికి మొన్న, చింతమనేని పై ఫేక్ వీడియో తిప్పారు. అలాగే గుంటూరులో రైతు చనిపోతే, పోలీసులు కొట్టి చంపారు అంటూ, హడావిడి చేసారు. పసుపు కుంకుమ అప్పు అంటూ, పుకార్లు పుట్టించారు. ఇలా అనేక విధాలుగా ప్రశాంత్ కిషోర్ టీం, మన రాష్ట్రంలో ప్రశాంత లేకుండా చేస్తుంది.

radha 19032019

ఈ నేపధ్యంలో, ప్రశాంత్ కిషోర్ పై, జగన్ పై, చంద్రబాబు విమర్శలు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లో కూర్చుని, వీళ్ళ రాజకీయం కోసం, ఏపిలో ఎలాంటి పనులు చేస్తున్నారో విమర్శిస్తూ వస్తున్నారు ప్రతి మీటింగ్ లో, ప్రశాంత్ కిషోర్ నిర్వాకాలు చెప్తూ వస్తున్నారు. అయితే, పాపం ప్రశాంత్ కిషోర్ ఈ మాటల పై హార్ట్ అయ్యారో, లేక తన గుట్టు అంతా చంద్రబాబు విప్పుతున్నారు, ఎప్పటికప్పడు, తనని దోషిగా ప్రజల ముందు నిలబెడుతున్నారు అనే అసహనంతో, ఈ రోజు చంద్రబాబు పై ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్ చేసారు. రాజకీయ కాంట్రాక్టు చేసుకునే ఒక బీహార్ వ్యక్తి, జగన్ అండ చూసుకుని, చంద్రబాబుని విమర్శించే స్థాయికి వచ్చాడు అంటే, బ్యూటీ అఫ్ డెమోక్రసీ అనుకోవటమే.

radha 19032019

ఓటమి దగ్గరపడినప్పుడు ఎంతటి అనుభవజ్ఞడైన రాజకీయ నేతయినా సరే వణికిపోతాడని.. కాబట్టి చంద్రబాబు ప్రేలాపనలు తనకు పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించడం లేదని అన్నారు. బీహారీ బంధిపోటు అంటూ తనను అమర్యాదపూర్వకంగా సంబోధించడం.. బీహార్‌పై మీ చెడు దృక్పథాన్ని బయటపెడుతోందంటూ విమర్శించారు. అయితే, ఇక్కడ తను చేసే లత్కోర్ పనులకు చంద్రబాబు విమర్శ చేస్తుంటే, ప్రశాంత్ కిషోర్ మాత్రం, బీహార్ మొత్తాన్ని చంద్రబాబు అంటున్నారు అంటూ, కొత్త పల్లవి అందుకున్నారు. అయినా చంద్రబాబు తాను ఏమి చేసింది, గంటన్నర చెప్పే, ఏ విమర్శ అయినా చేస్తారు. చంద్రబాబు చెప్పే అభివృద్ధి ప్రతి రోజు ప్రజలు వింటుంటే, ఈ బీహారీ బాబు సలహాలు చంద్రబాబుకు అవసరమా ? చేసే పనులు మంచివి అయితే, ప్రశాంత్ కిషోర్ ని కాని, జగన్ ని కాని, ఏమి అనరు కదా..

Advertisements

Advertisements

Latest Articles

Most Read