నేను అలా అనలేదు... నా మాటలు వక్రీకరించారు... అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడో లేదో, వీడియోతో సహా దొరికాడు...మరో పక్క, మా పవన్ అలా అనలేదు, ఆయాన అనని మాటలు, అన్నట్టు చెప్తున్నారు, వీడియోలు ఎడిటింగ్ చేసారు అంటూ, పవన్ సినిమా ఫాన్స్ హడావిడి అయితే, అంతా ఇంతా కాదు, చివరకు వీడియో బయట పడటంతో, అడ్డంగా దొరికిపోయాడు పవన్... ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా ? "స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఏమి ఇస్తారు అనేది అనవసరం, పేరు ఏదైనా మాకు డబ్బులు కావలి" అంటూ పవన్ News18లో ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి...
నిన్న ఈ విషయం బయటకు రావటంతో, అందరూ ఆశ్చర్యపోయారు... ఇదే విషయం చంద్రబాబు అంటే, పాచి పోయిన లడ్డులు అని చెప్పిన పవన్, ఇప్పుడు ఇలా ఎందుకు అన్నారు, ఒక పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటూ, రాష్ట్రానికి సరిపడా డబ్బులు ఇస్తే చాలు అనటం ఏంటి ? చంద్రబాబు చెప్పింది కూడా ఇదే కదా... అప్పుడు చంద్రబాబుని విమర్శించిన పవన్, మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు అన్నారు అంటూ అందరూ ఆశ్చర్యపోయారు... మోడికి, పవన్ కొన్ని కారణాల చేత లొంగిపోయారని అనుకున్నారు...
అయితే, ఈ విషయం పై తీవ్ర విమర్శలు రావటంతో, ఈ రోజు పవన్, తన ట్విట్టర్ లో స్వయంగా ప్రకటించారు... నేను అలా అనలేదు, నా మాటలు వక్రీకరించారు అంటూ, నాకు స్టేటస్ కావలి, డబ్బులు కావాలి అంటూ ట్వీట్ చేసారు... అయితే, పవన్ అలా అన్నాడో లేదో, వీడియో బయటకు వచ్చింది, దాంట్లో స్పష్టంగా "కుచ్ భీ నేమ్ లాగావ్" అంటూ పవన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎదైతో ఉందో, అది చూసిన ఎవరు ఇది పవన్ పొరపాటున అన్నట్టు లేదు... ఇంటర్వ్యూ చేసిన ఛానలే, పవన్ డబ్బులు ఇస్తే చాలు అన్నారని రాసింది, అదే తెలుగు చానల్స్ కూడా తీసుకున్నాయి.. పవన్, ఏ మాటాలు అన్నాడో, న్యూస్ 18 అదే రాసింది.. మరి పవన్, వక్రీకరించారు అని అనటం, ఎదైతో ఉందో, నిజం ఏంటో ఆయనికే తెలియాలి... ఇలా రోజుకు ఒక మాట మాట్లాడుతూ, పవన్ రోజు రోజుకి దిగజారిపోతున్నారు... కేంద్రానికి ఎందుకు ఇలా లొంగిపోయారో, అసలు ఎజెండా ఏంటో పవన్ చెప్పాలి...