తెలుగుదేశం పార్టీతో మిత్రత్వం చెడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు బీజేపీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది... ఓ వైపు రాష్ట్ర పార్టీ బలోపేతానికి సంస్థాగతమైన మార్పులు చేపడుతూనే, మరో వైపు రాష్ట్ర ప్రజల సెంటిమెంటు, భావోద్వేగాలకు అనుగు ణంగా నడుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ప్తున్నాయి... రాయలసీమలో పట్టుకోసం కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకునేందుకు విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటు ఇవ్వాలనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చిందని సమాచారం...

modi 01042018

పార్టీ నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రాష్ట్ర పర్యటనకు వచ్చి ప్రకటించే అవకాశాలున్నట్లు చెపుతున్నారు. ఒకవేళ మోదీ రాక ఆలస్యమైన పక్షంలో ముందు పార్టీ నేతల ద్వారా ప్రకటించి శంకుస్థాపన కార్యక్ర మాలకు ప్రధానిని తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు... అయితే మోడీ పనితనం తెలిసినవారు, ఇది కేవలం రాజకీయ అడుగుగానే భావిస్తున్నారు.. ఎందుకంటే, ఇలాంటి ప్రాజెక్ట్ లు ఎన్నో, మొదలు పెట్టి, పక్కన పడేసింది చూస్తున్నాం... మనకు ఇచ్చిన 11 యూనివర్సిటీల సంగతి చూస్తూనే ఉన్నాం... ఇవి పూర్తి కావటానికి, ఇప్పుడిస్తున్న నిధులు ఇస్తుంటే, మరో వంద సంవత్సరాలు పడుతుంది.. ఇవి కూడా ఇంతే...

modi 01042018

అయితే, రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయంగా దూసుకుపోతున్నారు... ఇలాగే వదిలిస్తే, ఢిల్లీలో వచ్చి కూర్చుంటాడు అనే భయం... పవన్, జగన్ తో, చంద్రబాబుని ఆడిద్దాం అనుకుంటే, చంద్రబాబు వీళ్ళని ఒక ఆట ఆడుకుంటున్నాడు... అందుకే మోడీ స్వయంగా రంగంలోకి దిగి, చంద్రబాబుకి రాజకేయంగా చెక్ పెట్టే విధంగా, ఎదో చేస్తున్నాం అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించటానికి రెడీ అవుతున్నారు... అందుకే మొన్నటి దాక, రైల్వే జోన్ కి ఒరిస్సా అడ్డంకి అని చెప్పారు, స్టీల్ ప్లాంట్ లాభాలు రాదు అని చెప్పారు... కాని, ఇప్పుడు అవి ప్రకటించి, ఎదో చేస్తున్నట్టు హడావిడి చెయ్యనున్నారు... ఏప్రిల్‌ 6న పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధానిని రాష్ట్ర పర్యటనకు తీసుకురావాలనే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉంది... ఒక వేళ వీలుకాని పక్షంలో అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, రామ్‌మాధవ్‌లను రప్పించి ప్రకటించనున్నారు. ఆపై ఆయా ప్రాజెక్టుల శంఖుస్థాపన కార్యక్రమాలకు ప్రధాని మోదీని తీసుకురావచ్చనేది బీజేపీ నేతల ఆలోచనగా ఉంది... అయితే, విభజన హామీల్లో పెండింగ్ లో ఉన్న, 19 విషయాలు పెండింగ్ లో ఉన్నాయి... అందులో ప్రధానంగా ప్రత్యెక హోదా, ఆర్ధిక లోటు విషయంలో మాత్రం ఎటూ తేల్చటం లేదు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read