సోమవారం సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన అప్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తికావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2050 మీటర్లు పొడవున వున్న అప్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ నిర్మాణం పూర్తి చేశామని, డౌన్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ పనులు 77% అయ్యాయని అధికారులు వివరించగా, జూలై 9 నాటికి ఆ పనులు కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం పనుల పురోగతిపై 65వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేయగా, ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 55.73% పూర్తయిందని అధికారులు వివరించారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 61.62% నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌ తవ్వకం పనులు 75.60% పూర్తికాగా, స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 27.20% పూర్తయినట్టు తెలిపారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.22%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70% చేపట్టినట్టు వెల్లడించారు.

polavaram 26062018 2

గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.49 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 42 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 843.29 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌, స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 10.01 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 11,020 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి.

polavaram 26062018 3

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ‘పునరావాసం-పరిహారం’ కింద ఉద్దేశించిన రూ. 3,115.11 కోట్లకు గాను ఇప్పటివరకు రూ. 219.25 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి ఆర్ఆర్ పనులు పూర్తవ్వాలని తూర్పగోదావరి జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ఆర్ ప్యాకేజీ త్వరితగతిన అమలు చేసేందుకు ఐఏఎస్ అధికారులు, నిపుణులతో కూడిన 5 ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. తూర్పుగోదావరిలో 7 ఆర్ఆర్ కాలనీలు, పశ్చిమగోదావరిలో 19 ఆర్ఆర్ కాలనీలు పూర్తయ్యాయని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read