పోలవరం విషయంలో వచ్చే సంవత్సర కాలం, ఎంతో కీలకమైనది... మరో రెండు నెలల్లో గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరో పక్క, పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మాణం కూడా, ఈ సంవత్సరమే పూర్తి చేసే క్రమంలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర అనాలోచిత నిర్ణయం వల్ల, పోయిన ఏడాది మూడు నెలలు అమూల్యమైన సమయం వేస్ట్ అయిపొయింది... చంద్రబాబు ఎలాగోలా సాధించి, నవయుగని తీసుకువచ్చి, కాఫర్ డ్యాంకి పర్మిషన్ లు తీసుకువచ్చి, పనులు ఆగకుండా చేసారు... అయితే, నిధులు విడుదలలో మాత్రం, కేంద్రం తీవ్ర జాప్యం చేస్తుంది... ఇప్పటికే మనం పెట్టిన ఖర్చు, 4 వేల కోట్లు పైన మనకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై, ఈ ప్రభావం చూపే అవకాసం ఉండి.
పోలవరం జాతీయ ప్రాజెక్ట్... కేంద్రం డబ్బులు ఇవ్వాలి అది మన హక్కు... కాని కేంద్రం కావాలని లేట్ చేసిన కొద్దీ, ప్రాజెక్ట్ లేట్ అయిపోతూ ఉంటుంది.. ఎందుకుంటే ఇదే కీలక సమయం.. జూన్ లోపు సాధ్యమైనంత ఎక్కువ పని చెయ్యాలి... వర్షాలు పడటం మొదలైతే, పని సాగదు... అందుకే, ఎటు పోయి, ఎటు వస్తుందో అనే ఉద్దేశంతో, చంద్రబాబు పోలవరం విషయంలో, మొత్తం కేంద్రం పై ఆధార పడకుండా, ప్రాజెక్ట్ పుర్తవటం కోసం, ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించిన నేపథ్యంలో.. దీనికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.9,835.86 కోట్లు కేటాయించారు.
మొత్తం జలవనరుల శాఖ పద్దు రూ.16,852.27 కోట్లు కాగా.. అందులో పెద్ద ఖాతా పోలవరానిదే కావడం గమనార్హం. అంటే, ఒక వేళ కేంద్రం సరైన సమయంలో స్పందించకపోయినా, రాష్ట్రం ముందు ఖర్చు చేసి, తరువాత మన హక్కుగా రావల్సిన డబ్బులు తీసుకుంటుంది... భూపరిహారం, ఎలాగూ 33 వేల కోట్లు కేంద్రమే ఇవ్వాలి... అందుకే ముందుగా ప్రాజెక్ట్ అయినా పూర్తి చెయ్యాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు... ఇప్పుడు కనుక ట్రాక్ తప్పితే, ఇక పోలవరం ఎప్పటికి అవుతుందో చెప్పలేము.. అందుకే, చంద్రబాబు కేంద్రంతో వైరం వచ్చినా, ముందు ప్రాజెక్ట్ ఆగిపోకుండా, ఇబ్బంది లేకుండా ఉండటానికి, ముందు చూపుతో ఆలోచించి, రాష్ట్ర బడ్జెట్ లోనే, పోలవరం ప్రాజెక్ట్ కు 9 వేల కోట్లు కేటాయిస్తున్నారు...