ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ 2019 నాటికి పూర్తి చెయ్యాలి అని ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతుంటే, కేంద్రం వైపు నుంచి మాత్రం ఆ రకమైన వేగం లేదు... కాఫర్ డ్యామ్ నిర్మాణం దగ్గర వచ్చిన ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది... కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చింది, కాని వెంటనే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అభ్యంతరం చెప్పింది... కాఫర్ డ్యామ్ కి, హైడ్రో పవర్ కి సంబంధం ఏంటో ఇప్పటి వరకూ ఎవరికీ తేలీదు... ఎన్‌హెచ్‌పీసీ బృందం ఇప్పటిదాకా కాఫర్ డ్యామ్ పై నివేదిక ఇవ్వలేదు.. ఎప్పటికి ఇస్తుందో తెలీదు...
మరో పక్క ఒకరి తరువాత ఒకరు కేంద్రం నుంచి వస్తున్నారు... పోలవరంలో ఎన్‌హెచ్‌పీసీ బృందం పర్యటించాక వాప్కోస్ బృందం వచ్చింది. ఆ తర్వాత.. పోలవరం ప్రాజెక్టు సీఈవో హాల్దర్ పర్యటించారు. ఆయన పర్యటనలో ఉండగానే కేంద్ర మంత్రి గడ్కరీ ఓఎస్డీ ఖోలాపుర్కర్ వచ్చారు. త్వరలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రానున్నారు. జనవరి మొదటి వారంలో ఎవరు ఎందుకు వస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలీదు... పోలవరం అథారిటీ సీఈవో సౌమిత్రహల్దార్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో అతివేగం పనికి రాదని అంటారు... నిన్న వచ్చిన గడ్కరీ సాంకేతిక సలహాదారు సంజయ్ కోలా పుల్కర్, తొందరగా పూర్తి చెయ్యాలి అంటారు...
ఒకరేమో, ఎగువకాఫర్ డ్యామ్ విడిగా కట్టకూడదు ప్రధాన డ్యాంలో అంతర్భాగంగా ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం జరగాలి అంటారు... నిన్న వచ్చిన ఆయనేమో, అసలు అలా ఎలా కడతారు, అది పెద్ద తప్పు అంటారు... ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు రావటం, ఎవరి అభిప్రాయం వారు చెప్పటం, మరింత కన్ఫుజన్ క్రియేట్ చేసి, మరింత క్లిష్టంగా సమస్యను తయారు చేస్తున్నారు.. ఇంత కన్ఫుజన్ లో చివరకి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు... సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. 23 సార్లు స్వయంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి, 42 సార్లు వర్చువల్ సమీక్షలు నిర్వహించి పనులను పరుగులెత్తించారు. సరిగ్గా కీలకమైన కాఫర్ డ్యామ్ దగ్గరకు వచ్చేసరికి కొర్రీలు మొదలయ్యాయి... ఇది ఎప్పటికి సెట్ అవుతుందో ఏంటో...