పోలవరం పై ఒకే రోజు రెండో శుభవార్త వినిపించింది కేంద్రం... రెండు నెలల క్రితం కాఫర్ డ్యాం ఆపెయ్యమని కేంద్రం చెప్పింది... దీని పై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అలజడి మొదలైంది... ఏకంగా చంద్రబాబు మీకు ఒక నమస్కారం అని కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు... ప్రజల్లో ఆందోళన మొదలైంది... చంద్రబాబు వల్లే కాకపోతే ఇంకా పోలవరం ఎవరు పూర్తి చేస్తారు అనే సందేహం ప్రజల్లో వ్యక్తమైంది... అందరిలోనూ ఒకటే ఆందోళన... చంద్రబాబు కొరియా పర్యటనలో ఉండి కూడా నితిన్ గడ్కరీతో మాట్లాడి ఒత్తిడి తెచ్చారు.. ఇలా చేస్తే కష్టం అని తెగేసి చెప్పారు కూడా... అయినా రెండు నెలలు ఉలుకు పలుకు లేదు...

polavarm cbn 005012018 2

కేంద్రం నుంచి ఆ కమిటీ అని, ఈ కమిటీ అని, ఒకరి తరువాత ఒకరు వచ్చారు... ఒకరు కాఫర్ డ్యాం కావాలి అంటారు... ఇంకొకరు అక్కర్లేదు అంటారు.. ఇలా రెండు నెలలు కాలయాపన చేసారు... చంద్రబాబు రంగంలోకి దిగి కాఫర్ డ్యాం లేకుండా ఏ పెద్ద డ్యాం అయినా నిర్మాణం జరిగిందా, ఇది కాఫర్ డ్యాం వల్ల ఉపయోగం అని ఎంత చెప్పినా, అటు నుంచి రియాక్షన్ లేదు... ఎక్కడ నొక్కారో కాని, చంద్రబాబు తీవ్ర ఒత్తిడి మాత్రం కేంద్రం మీద తెచ్చారు అనేది అర్ధమవుతుంది... నిన్న పోలవరం కాంట్రాక్టర్ మార్చటానికి కేంద్రం ఒప్పుకుంది, ఇవాళ ఉదయం చాలా రోజుల తరువాత ప్రధాని మోడీ, మన ఎంపీలతో మన రాష్ట్ర సమస్యల పై స్పందించారు....

polavarm cbn 005012018 3

ఇవాళ సాయంత్రానికి, కాఫర్ డ్యామ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది... పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం పై డిజైన్ రివ్యూ కమిటీ ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా పోలవరం కాఫర్ డ్యామ్‌కు ఏబీ పాండ్యా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో కాఫర్ డ్యాం నిర్మాణానికి కెల్లర్ సంస్థ సిద్ధమైంది. ఎగువ కాఫర్ డ్యాం పనులు ఆపాలని..అప్పటి కేంద్ర జలవనరుల కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారుల వాదనలు వినిపించారు... దీంతో మన వాదన సరైనిదే అని కమిటీ తేల్చింది... కాఫర్ డ్యామ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read