పోలవరం ప్రాజెక్టు పనుల్లో నేడు మరో కీలక అడుగు పడింది. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం కోసం జెట్‌ గ్రౌటింగ్‌ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పోలవరంలో ప్రారంభించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీసమావేశంలో కాఫర్‌ డ్యాంను గత డిజైన్ల మేరకే నిర్మించుకోవచ్చని ఆమోదం లభించింది. టెండర్లను ఆమోదించిన సమయంలో చేసుకున్న ఒప్పందాల మేరకు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టాలని సూచించింది. దీంతో అనుమతి వచ్చిన రెండు రోజుల్లోనే జెట్‌ గ్రౌటింగ్‌ పనులు చేపట్టాలని రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. 

polavaram 08012018

ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గునటానికి వచ్చిన సీఎం చంద్రబాబు జెట్‌గ్రౌటింగ్‌ పనులను ప్రారంభించారు. అలాగే స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనుల్లో కొంత భాగాన్ని కొత్త సంస్థకు అప్పగించేందుకు జల వనరుల శాఖ పిలిచిన టెండర్లను ఈ నెల నాలుగో తేదీనే తెరవచ్చని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ సూచించారు. అయితే ఈ టెండర్లను తెరవాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశం జరగాలి. ఈ సమావేశంలో టెండర్లపై అధికారికంగా నిర్ణయం వస్తుంది.

polavaram 08012018

ఆ ఆదేశాలతో ఒకవైపు ఎగువ కాఫర్‌ డ్యాం, మరో వైపు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులూ సమాంతరంగా జరిగితే.. లక్ష్యం మేరకు పూర్తికి వీలుంటుందని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు గంటకు 600 టన్నుల మేర కాంక్రీట్‌ తయారు చేసేందుకు రూ.25 కోట్ల విలువైన అగ్రిటెక్‌ కూలింగ్‌ ప్లాంట్‌ను ట్రాన్‌స్ర్టాయ్‌ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసింది. స్పిల్‌వే గేట్లకు నమూనా గేటును 2-1.6 మీటర్లతో తయారు చేశారు. ఈ గేటును కూడా సీఎం ప్రారంభించారు. జూన్‌ నాటికి కీలక పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read