సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన పనుల ప్రగతిని పరిశీలించారు. అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎగువ కాపర్ డ్యామ్ జట్ గ్రౌటింగ్ పనులకు పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించిన ఆగ్రిటెక్ కూలింగ్ ప్లాంట్ తో పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో వేగం పంజకోనుంది. ఇప్పటి వరకు రోజుకు 3 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ చేస్తుండగా ఇక నుండి 5 వేల క్యూబిక్ మీటర్లకు పెరగనుంది. ప్రధాన కాంట్రాకు సంస్థ రూ.25 కోట్లతో దుబాయి కేటీఐ కంపెనీకి చెందిన ఆగ్రిటెక్ కూలింగ్ ప్లాంట్ విడి భాగాలను తీసుకొచ్చి ప్రాజెక్టు క్షేత్రంలో బిగించారు.
ఇప్పటి వరకు ఐస్ ముక్కలు ఉపయోగించి కాంక్రీట్ను 12 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తయారు చేసేవారు. దీనిని టెలీబెల్ట్ ద్వారా స్పిల్ వేకు 300 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి పంపేవారు. ఆ తర్వాత ఆ టెలీబెల్ట్ ను ఆక్కడి నుంచి తొలగించి. 300 మీటర్ల దూరం నుంచి మళ్లీ స్పీల్ వే వరకు అమర్చి కాంక్రీటును పోసేవారు. టెలీబెల్ట్ ను తొలగించి వేరే చోట బిగించేందుకు రెండు గంటల సమయం పట్టేది. పైగా ఈ కాంక్రీటును అర మీటర మందాన మాత్రమే పోసేవారు. ఆది చల్లారాక మళ్లీ 72 గంటలు పూర్తయ్యాక మాత్రమే దాని పై మరో ఆరమీటరు మందాన కాంక్రీటు వేసేందుకు ఇంతవరకు అవకాశం ఉంది.
ఇప్పడు ఆగ్రిటెక్ కూలింగ్ ప్లాంట్ గంటకు 600 టన్నుల మెటల్ ను కూలింగ్ చేసి, కాంక్రీట్ తయారు చేసే రెండు బ్లాచింగ్ షాంట్లలోకి 300 టన్నుల చొప్పన నేరుగా సరఫరా చేస్తుంది. దీని ద్వారా తయారైన కాంక్రీట్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఆందుచేత ఒకేసారి మీటరు నుంచి మీటరున్నర మందంతో కాంక్రీట్ వేయవచ్చు. టెలీబెల్ట్ ను తరచూ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో రెండు టెలీబెల్ట్ లు ఉంటాయి. కొత్త అగ్రిగేటర్ కూలింగ్ ప్లాంట్ వల్ల రోజుకు 5000 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయడానికి వీలవుతుంది. ఈ ప్లాంట్ వల్ల స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనులు పుంజుకుంటాయి.