నవ్యాంధ్ర విధ్వంసం, ప్రజా వేదికతో మొదలై, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలవరం విషయంలో చూస్తుంటే, అసలు ఈ ప్రాజెక్ట్ బహుళార్థ సాథక ప్రాజెక్ట్, ఇప్పుడు అది కాస్త ఓక్ చిన్న రిజర్వాయర్ కాబోతోంది. గ్రావిటీ ప్రాజెక్ట్.. ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాబోతోంది అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలవరంలో చంద్రబాబు అడ్డంగా దోచేసారని, అందుకే రివర్స్ టెండరింగ్ అనే విధానం అవలభిస్తున్నాం అని, ఇక మీదట జరిగే పనులు అన్నిటికీ రీటెండరింగ్ వేస్తామని, దానికి ఎవరు అయితే తక్కువ కోట్ చేస్తారో, వారికి పనులు ఇస్తామని, దీని ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు. పోలవరం రీటెండరింగ్ లో, మొత్తం 700 కోట్లు అదా చేసామని, బాకా కొట్టారు. దీనికి ఒక న్యాయ కమిటీ కూడా ఉందని, వారి కనుసన్నల్లోనే జరుగుతుందని, ఎక్కడా ప్రభుత్వం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని చెప్పారు. అయితే వారు చెప్పిన దానికి చేస్తున్న దానికి మాత్రం పోలిక లేదు. పోలవరం వాళ్ళు చెప్పింది 700 కోట్లు అదా చేసామని, అయితే పత్రికల్లో గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు చూస్తే, ఒక్కసారిగా 2200 కోట్ల వరకు, పోలవరం అంచనాలు అమాంతం పెంచేసారు. అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా ? కేంద్ర ప్రభుత్వం ఉన్న పంచాయతీ ఏంటి ? గత ప్రభుత్వంలో డీపీఆర్ 2 ఆమోదించుకి కూడా, ఇప్పటికీ సాధించలేక పోయారు.
కేంద్ర అనేక కొర్రీలు పెడుతుంది, 20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని అంటుంది, దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ తెచ్చుకోలేదు. తెచ్చుకోక పోగా, ఇప్పుడు మళ్ళీ 2200 కోట్ల వరకు అంచనాలు పెంచేశారు. ఇందులో మెయిన్ డ్యాంకే, 1600 కోట్లు పెంచేసారు. అయితే ఇంకోటి, ఇక్కడ పోలవరంలో కొత్తగా ఎత్తిపోతల పెడతాం అనటం, మరింత అనుమానాలకు దారి తీస్తుంది. గతంలో పట్టిసీమ కడితే, దాన్ని దోచేశారు, అని గోల గోల చేసారు. అయితే దాని ఉపయోగం ఏంటో ప్రజలకు తెలిసింది. ఇప్పడు అసలు పోలవరంలో డెడ్ స్టోరేజ్ నుంచి, ఎత్తిపోతల అని చెప్పటం, దానికి మళ్ళీ 900 కోట్లు కేటాయించటం అనుమానాలకు దారి తీస్తుంది. ఇక ఇంతకు ముందే, ఇసుక కోసం అని, మరో 500 కోట్లు పెంచేసారు. మొత్తం మీద, ఇవన్నీ కలిపి, 3200 కోట్ల వరకు, పోలవరం అంచనాలు పెంచేశారు. మరి గతంలో చెప్పిన రివర్స్ టెండరింగ్ ఆదా 700 కోట్లు అనే విషయం ఏమిటి ? ఇప్పుడు ఎందుకు పెంచారు ? కేంద్రం ఎలాగూ ఇవ్వదు కాబట్టి, రాష్ట్ర డబ్బులు నుంచే కాంట్రాక్టర్ కు ఇవ్వాలి కదా ? అసలు గ్రావిటీ ద్వారా వచ్చే పోలవరంలో, ఎత్తిపోతల ఎందుకు ? ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సామధనలు చెప్పాలి.