పోలవరం ప్రాజెక్టులో మరో అద్భుతం ఆవిష్కరణ జరగబోతుంది. ప్రాజెక్టులో ముఖ్యమైన స్పిల్ వే మధ్య భాగంలో స్వరంగమార్గంకు జరిగే పనులను దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం జరిగింది. స్పిల్ వే మధ్యభాగం నుండి 1100 మీటర్ల పొడవున ఈ నిర్మాణం సాగింది. స్పిల్ వే మొత్తం 48 గేట్లను అమరుస్తారు. దీనికి స్పిల్ వే లో మూడవ బ్లాక్ నుండి 49వ బ్లాక్ వరకు కట్టారు. అందుకు 8 లక్షల క్యూ. మీల కాంక్రీట్ను వాడారు. దీని భూగర్భం నుండి 28 మీటర్ల ఎత్తులో అమరుస్తారు. దీనిని గ్యాలరీగా పిలుస్తారు. ఈ గ్యాలరీ నుండి ప్రాజెక్టుకు సంబంధించిన భూగర్భంలో చేసిన పనులను పరిశీలించవచ్చు.

polavaram 09092018 2

ప్రాజెక్టు మొత్తం పూర్తి అయిన తరువాత ఏమైన చిన్న చిన్న తేడాలు మరమ్మతులు చేయవలసి నప్పుడు ఈ గ్యాలరీ ద్వారా ఇంజినీర్లు వెళ్ళి పరిశీలించి చేయవలసి ఉంటుంది. భూగర్భంలో ఉండే గ్యాలరీలోకి గాలి వెలుతురు వచ్చేలా ప్రత్యేకంగా పైపులు కూడా ఉంటాయి. పోలవరం గ్యాలరీలో ప్రతి బ్లాక్‌లో ఒక అడుగు వ్యాసంతో ఈ పైపులను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సారిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నిర్మించిన గ్యాలరీని అప్పుడు ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధి ప్రారంభించారు. దేశంలోనే పెద్దదైన పోలవరం ప్రాజెక్టులో అతి పెద్ద గ్యాలరీ కట్టారు. పోలవరం ప్రాజెక్టుకు గ్యాలరీ ఒక ముఖ్యమైన నిర్మాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12వ తేదీన పోలవరం గ్యాలరీని ప్రారంభించనున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టులో మరో కీలక అడుగుపడనుంది.

polavaram 09092018 3

గోదావరి నది ప్రవాహానికి అడ్డంగా నదీ గర్భంలో నిర్మించిన డయాఫ్రంవాల్ గోడను పూర్తి చేసినటు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీగువ కాఫర్ డ్యాం 196 మీటర్ల పనులను పూర్తి చేయవలసి ఉంది. గోదావరి నీటి మట్టం తగ్గితేనే గాని ఈ వనులు మొదలు పెట్టరు. స్పిల్ ఛానల్ కు సంబంధించి 18.75వేల క్యూ. మీల పనులు చేయవలసి ఉండగా లక్షా యాభై వేల క్యూ. మీలు పూర్తి అయ్యాయి. స్పిల్ వే కాంక్రీట్ పనుల సంబంధించి 16 లక్షల 40వేలు క్యూ.మీలు చేయవలసి ఉండగా 9లక్షల 50 వేల క్యూ.మీల పనులు పూర్తి చేశారు. గేట్లు సంపూర్ణంగా పూర్తి చేయడానికి విదేశాల నుండి యంత్ర సామాగ్రి రావలసి ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read