మనిషి సంకల్పం ముందు కొండలైనా పిండి అవ్వాల్సిందే అంటారు పెద్దలు.... అవును ఇప్పుడు నిజంగానే కొండలు పిండి అవుతున్నాయి... 7 దశాబ్దాల ఆంధ్రుల కల, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుస్తున్నారు... ఆయన పట్టుదలకి మరో ఉదాహరణ, పోలవరం స్పిల్ వే గేట్లు... పోలవరం ప్రాజెక్ట్ లో అతి ముఖ్యమైన ఘట్టం ఈ 48 స్పిల్ వే గేట్ల తయారీ...
హైదరాబాద్‌కు చెందిన బికమ్ అనే సంస్థకు గేట్ల తయారీ బాధ్యతను అప్పగించారు. సేలంలోని, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి స్టీల్‌ను సేకరించారు.
900 మీటర్ల పొడవైన స్పిల్ వేకు మొత్తం 48 గేట్లు గేట్లు ఉంటాయి. ఒక్కో గేటు పొడవు 21మీటర్లు... ఎత్తు 16మీటర్లు ఉంటాయి. ఒక్కో గేటు తయారీకి 365టన్నుల చొప్పున మొత్తం 48 గేట్ల తయారీకి సుమారు 19వేల టన్నుల ఐరన్ ఉపయోగించారు.
అత్యంత వేడి వాతావరణంలో గేట్లను తయారు చేయాల్సి ఉంటుంది. సిబ్బంది ఎంతో కష్టపడి అనుకున్న గడువు కంటే మూడు నెలలు ముందుగానే, కేవలం నాలుగున్నర నెలల వ్యవధిలోనే గేట్లు తయారుచేసారు. మొత్తం 500 మంది సిబ్బంది గేట్ల తయారీకి శ్రమించారు.
ఇప్పుడు ఈ గేట్లను బిగించాల్సి ఉంటుంది. వీటికి అవసరమైన సిలిండర్లు, బుష్‌లు జపాన్, జర్మనీల్లో తయారవుతున్నాయి. ఒక్కో గేటుకు 8 ఆర్న్ గడ్డర్స్, నాలుగు హారిజాంటల్ గడ్డర్స్ అవసరమవుతాయి. మొత్తం 48గేట్లకు 384 ఆర్న్ గడ్డర్స్, 192 హారిజాంటల్ గడ్డర్స్ అవసరమవుతూ ఉండగా ఆ పనులు కూడా మొదలయ్యాయి.
డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ గేట్లను నిలబెడతారు... ఈ ప్రక్రియ పూర్తయితే, పోలవరం ప్రాజెక్ట్ కి ఒక రూపు వస్తుంది...