సముద్రమట్టానికి 34 నుంచి 55 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న పోలవరంప్రాజెక్ట్ ని ఏమాత్రం అనుభవంలేని, ఎటువంటిసాంకేతిక పరిజ్ఞానంలేని లిఫ్టులు, పంపులు తయారుచేసే కంపెనీకి అప్పగిం చిన జగన్ ప్రభుత్వం, ప్రజల్లో భయాందోళనలకు తెరలేపిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు తెలిపారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ, 194 టీఎంసీలనీటిని నిల్వ చేసే రేడియల్ గేట్ల డిజైన్ లో, వాటితయారీకి ఉపయోగించిన మెటీ రియల్, ఫ్యాబ్రికేషన్, ఇతరత్రా నాణ్యతా పరమైన అంశాల్లో రాజీపడుతున్నారనే వార్తలు రాష్ట్రరైతాంగానికి, ప్రజలకు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వరదల సమయంలో ప్రాజెక్ట్ నుంచి 50లక్షలక్యూసెక్కుల నీరుఒక్కరోజే వస్తుందని, అంతటినీటిప్రవాహాన్ని నిలువరించగలసామర్థ్యం ప్రాజెక్ట్ గేట్లకు ఉంటుందాఅనే సందేహం అందరిలోనూ కలుగుతోందన్నా రు. ప్రాజెక్ట్ భధ్రతకు ప్రమాదంఏర్పడితే, ఉభయగోదావరి జిల్లాలు రెండూకూడా బంగాళాఖాతంలోకలిసే ప్రమాదముందని నిమ్మల వాపోయారు. ప్రాజెక్ట్ పనుల నాణ్యతపై నీలినీడలు కమ్మకుంటున్న తరుణంలోరాష్ట్రప్రజలంతా జగన్ ప్రభుత్వ అలసత్వంపై ఆలోచన చేయాలన్నారు. పోలవరంఎత్తుని తగ్గించడంద్వారా, రాష్ట్రం మొత్తానికి సాగు,తాగునీరు అందించే అవకాశం లేకుండా చేస్తున్నా రని, బహుళార్థసాథకప్రాజెక్ట్ అన్నపేరుని పిల్లకాలువగా, చెక్ డ్యామ్ గామార్చే ప్రయత్నాలను జగన్ ప్రభుత్వంచేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే సుడిగుండంలో పోలవరం ప్రాజెక్ట్ చిక్కుకుపో యిందన్నారు. ప్రాజెక్ట్ ఎత్తుని 45.72మీటర్లనుంచి 41.15మీటర్ల కు (155అడుగుల ఎత్తుని 135 కి తగ్గించడం) తగ్గించేప్రయత్నం చేయడంతో, నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. ప్రభుత్వం ఎత్తుని తగ్గిస్తే, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అర్థం, పరమార్థమే అప హాస్యమవుతుందని నిమ్మల తెలిపారు. పోలవరం ఎత్తుపై ఎగువ రాష్ట్రాలుసుప్రీంకోర్టుకు వెళ్లడంజరిగిందని, 156 అడుగులఎత్తు వరకు ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ఎక్స్ పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై దేశఅత్యున్నత న్యాయస్థానంకూడా ఆమోదం తెలిపిందన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా, రాష్ట్రప్రభు త్వం పోలవరం ఎత్తుని తగ్గించేప్రయత్నాలు చేయడం, ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న చీకటిఒప్పందంలో భాగంగా జరుగుతున్నదేనని రామానాయుడు మండిపడ్డారు.

కేసీఆర్ ఎన్నికలవేళ తనకు ఆర్థికసహాయం అందించాడన్నకృతజ్ఞతతోనే జగన్మోహన్ రెడ్డి పోలవరంప్రాజెక్ట్ నిర్మాణాన్ని పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టడానికి సిద్ధమయ్యాడన్నారు. ఎన్నికల్లో ఆయన ఈ ముఖ్యమంత్రికి నిధులిచ్చాడని, నేడు జగన్ఆయనకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడన్నారు.ఆ విధంగా చేయడం జగన్ కు బాగా అలవాటైన క్విడ్ ప్రోకో పద్ధతేనని నిమ్మల ఎద్దేవాచేశారు. కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖకు సలహాదారుగా ఉన్న వెదిరే శ్రీరామ్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా ఉన్నా ఆయనసతీమణి శిల్పారెడ్డిలు జగన్ కనుసన్నల్లో తెలంగాణరాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. జగన్, కేసీఆర్ తో చేసుకున్న చీకటిఒప్పందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రే ఆ రాష్ట్ర అసెంబ్లీలో బట్టబయలుచేశాడన్నారు. రెండు, మూడుమీటర్లవరకు పోలవరం ఎత్తు తగ్గించుకుంటే, నష్టమేముంటుందని కేసీఆర్ తెలం గాణ అసెంబ్లీలోచెప్పినప్పుడే, జగన్ ఈరాష్ట్రానికి చేస్తున్న అన్యా యం ఏమిటో తెలిసిపోయిందన్నారు. తెలంగాణకు ఉపకారం చేయడంకోసమే జగన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 155 అడుగుల నుంచి 135 అడుగులకు కుదించాడన్నారు. దానివల్ల జగన్ ప్రభుత్వం, నిర్వాసితుల కుటుంబాలసంఖ్యను లక్షా7వేలనుంచి45వేలకు తగ్గించడానికి సిద్ధమైందన్నారు. దానివల్ల ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కూడా రూ.55వేలకోట్లనుంచి రూ.30వేలకోట్లకు తగ్గుతుందన్నారు. పోలవరం వ్యయంలో రూ.25వేలకోట్లను మిగుల్చుకోవడానికి సిద్ధ పడిన ముఖ్యమంత్రి జగన్, అంతిమంగా రాష్ట్ర రైతాంగంప్రయోజనా లను కేసీఆర్ కు తాకట్టుపెట్టడానికి సిద్ధపడ్డాడన్నారు. పోలవరం ఎత్తుని 135 అడుగులకే పరిమితంచేస్తే, ప్రాజెక్ట్ లో నీటినిల్వ సామర్థ్యం కూడా 194 టీఎంసీలనుంచి 115టీఎంసీలకే పడిపోతుం దన్నారు. 115 టీఎంసీలసామర్థమంటే అది కేవలం డెడ్ స్టోరేజ్ కే పరిమితమవుతుందని, దానివల్లబహుళార్థ సాథక ప్రాజెక్ట్ నిర్మాణ మనేది ఎందుకూ కొరగాకుండాపోతుందన్నారు.

గోదావరి జలాల నుసద్వినియోగంచేసుకోవాలన్న గతప్రభుత్వఆలోచనలన్నీ నీరు గారిపోయేలా ఇప్పుడున్న పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ ఎత్తుతగ్గిపుంతో విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు వినియోగించుకుందామనుకున్న 23.44 టీఎంసీల నీరుకూడా రాకుండాపోతుందని రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ఎత్తు తగ్గించడంద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా, ప్రకాశం జిల్లా సోమశిలకు నీటితరలింపుకూడా నిలిచిపో తుందన్నారు. దానితోపాటే, గోదావరి జలాలనురాయలసీమకు తరలించడం కూడా కలగానే మిగులుతుందన్నారు. కేసీఆర్ తో జగన్ చేసుకున్న చీకటిఒప్పందంకారణంగా, పోలవరం ప్రాజెక్ట్ బలి కాబోతోందన్నారు. తనక్విడ్ ప్రోకోలోభాగంగా, పోలవరంప్రాజెక్ట్ ని కేసీఆర్ కు తాకట్టుపెట్టడానికి అదేమీ జగన్ అబ్బసొత్తకాదని నిమ్మల తేల్చిచెప్పారు. జగన్ దుర్మార్గపు చర్యలపై రాబోయే రోజుల్లో రాష్ట్రరైతాంగంతో కలిసి, పోరాటంచేయడానికి కూడా టీడీపీ వెనుకాడదని నిమ్మలతేల్చిచెప్పారు. ప్రాజెక్ట్ఎత్తు తగ్గించాలే ఆలోచనకేంద్రానికి లేదన్ననిమ్మల, ఎత్తుతగ్గింపునకు సంబంధిం చిన ప్రపోజల్స్ వెదిరేశ్రీరామ్ రెడ్డి, ఆయనభార్య శిల్పా రెడ్డిలు కేంద్రానికి అందచేశారని విలేకరులు అడిగినప్రశ్నకు సమాధానంగా నిమ్మల అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి16న జరిగిన సమావేశంలో, శ్రీరామ్ రెడ్డి, శిల్పారెడ్డి లు ఇచ్చిన నివేదికను జగన్ ప్రభుత్వం తక్ష ణమే బహిర్గతంచేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను, జగన్ తోసిపుచ్చకపోవ డంకూడా పలుఅనుమానాలకు తావిస్తోందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read