ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసి, రెవిన్యూ లోటులో ముంచేస్తూ, ఆర్ధికంగా చితికిపోయిన రాష్ట్రంగా మనలని విడదీసినా, పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా చేసారు అనే ఒకే ఒక ఆశతో, మిగతావి దిగమింగుకున్నాం అనటంలో ఆశ్చర్యం లేదు. పోలవరం ప్రాజెక్ట్ అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని పిలిచేది ఇందుకే. అయితే కేంద్రం దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా చేసినా, మొదటి నుంచి కొర్రీలు పెడుతూనే ఉంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు, ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత గుర్తించి పోలవరం ప్రాజెక్ట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా వారానికి ఒక రోజు , ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులు సమీక్షించి, అవసరమైన మార్పులు చేర్పులు చేసేవారు. అంతే కాదు, కేంద్రం డబ్బులు ఇవ్వటం ఆలస్యం అవుతుందని, రాష్ట్ర ఖజానా నుంచే పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు చేసే వారు. అలా దాదాపుగా 11 వేల కోట్లు వరకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు ముందు చూపుతో, ప్రాజెక్ట్ పని 72 శాతం పూర్తయ్యింది. అయితే కేంద్రం మాత్రం కొర్రీలు పెడుతూనే వచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మారింది. పోలవరం ప్రాజెక్ట్ పడకేసింది. జగన్ ప్రభుత్వం రాగానే, పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ని మార్చారు. దీంతో పని నెమ్మదించింది. తరువాత కూడా చిన్న చిన్న పనులు చేసి, పెద్దగా చెప్పుకుంటున్నారు కానీ, అక్కడ పని అయితే నెమ్మదిగా సాగుతుందని, వివిధ ఆర్టీఐ రిపోర్ట్ లు చూస్తే అర్ధం అవుతుంది. అప్పటికే ఉన్న గడ్డర్లు బిగించటం, అప్పటికే తయారు చేసిన గేటులు అమర్చటం లాంటివి చేస్తే, అసలు పోలవరం మొత్తం మేమే పూర్తి చేసాం అనే విధంగా హడావిడి చేసారు.

polavaram 23032021 2

అయితే ఇప్పుడు లెక్కలతో సహా జగన్ ప్రభుత్వం ఈ రెండేళ్ళలో ఎంత ఖర్చు చేసిందో , కేంద్రం పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం రూపంలో అర్ధమైంది. చంద్రబాబి దిగిపోయే సమయానికి, పోలవరం కోసం ఖర్చు పెట్టిన నిధుల విషయంలో, కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సింది, రూ.5,108 కోట్లు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, దాదాపుగా రూ.4,084 కోట్లు కేంద్రం ఇచ్చింది. అంటే, ఈ లెక్క ప్రకారం, చంద్రబాబు హాయంలో చేసిన పనికి, ఇంకా రావాల్సింది రూ.1024 కోట్లు. మరి ఈ రెండేళ్ళలో జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కూడా ఈ లేక్కలోనే అర్ధమైంది. కేంద్రం సమాధానం ఇస్తూ, 2021 జనవరి వరకు కేంద్రం నుంచి రావాల్సిన పోలవరం బకాయిలు రూ.1,650 కోట్లుగా తేల్చింది. అంటే చంద్రబాబు హాయంలో ఖర్చు చేసిన బకాయలు రూ.1024 కోట్లును ఇందులో లెక్కిస్తే, ఈ రెండేళ్ళలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని కేవలం రూ.626 కోట్లు పని (1650-1024). అంటే ఈ రెండేళ్ళలో, ఏడాదికి రూ.300 కోట్లు పని పోలవరంలో చేసారు. ఇలా ఏడాదికి రూ.300 కోట్లు ఖర్చు చేస్తూ వెళ్తే, ఎప్పటికి పోలవరం పూర్తవుతుందో జగన్ గారే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read