పోలవరం ప్రాజెక్ట్ లో, గత నెల రోజుల్లో పనులు చాలా స్పీడ్ గా సాగుతున్నాయి. కీలకమైన పనులు అన్నీ పూర్తవుతున్నాయి. డయాఫ్రం వాల్ పూర్తి చెయ్యటం ఒక రికార్డు అయితే, ఒక్క రోజులో నవయుగ చేసిన కాంక్రీట్ పనులు కూడా ఒక రికార్డు. అయితే, అన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతున్న పోలవరం పనులకు అనుకోని అవరోధం ఎదురైంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ‘స్టాప్‌ వర్క్‌’ ఉత్తర్వుపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇచ్చిన స్టే ఆదేశాల గడువు జూలై 2తో ముగుస్తోంది. ప్రతి సంవత్సరం కేంద్రం, దీన్ని పొడిగిస్తూ వస్తుంది. మరి ఈ సారి ఏమి చేస్తుందో అని రాష్ట్ర అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండటంతో, టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే అధికారులు ఈ విషయం పై అనేక సార్లు ఢిల్లీ వెళ్లి చర్చించారు. స్వయంగా ముఖ్యమంత్రి లేఖలు రాసారు.

polavaram 28062018 2

పోలవరం పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా సడలించడం కాకుండా, శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలసంఘాన్ని కోరింది. డిశాలో తలెత్తే ముంపును దృష్టిలో ఉంచుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేంతవరకూ నిర్మాణ పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న అప్పటి యూపీయే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాతి కాలంలో ఈ షరతులను సమయానుకూలంగా ఆరునెలలు, సంవత్సరంపాటు సడలిస్తూ వస్తున్నారు. తాజాగా 2017 జులై 5న ఇచ్చిన సడలింపు ఈ ఏడాది జులై 2తో ముగియనుంది. ఇలా ప్రతిసారీ నిర్మాణ పనుల పై ఆంక్షలు విధించడం వల్ల తమకు పూర్తి అసౌకర్యం కలుగుతోందని, ఈ నిబంధనలను శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అనేక సార్లు కేంద్రాన్ని కోరారు.

polavaram 28062018 3

ఇదే అంశం పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రికి లేఖ కూడా రాసినట్లు వారి దృష్టికి తీసుకొచ్చారు. స్టే ఎందుకు కొనసాగించాలో స్పష్టం చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు లేఖ కూడా రాసింది. తర్వాత రెండ్రోజులకే ఒడిసా సీఎం లేఖ రాశారు. తమ అభ్యంతరాలను అందులో పేర్కొన్నారు. ఆయన చెప్పిన కారణాలు సహేతుకంగా లేవంటూ ఆంధ్ర జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కేంద్ర పర్యావరణ అటవీశాఖకు వివరిస్తూ మరో లేఖ రాశారు. స్టే పొడిగింపుపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి ఝా సానుకూలంగా ఉన్నా.. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కేంద్రం స్టాప్‌ ఆర్డర్‌ పై స్టేను పొడిగిస్తుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. గత ఏడాది కూడా ఇదే తరహాలో నాలుగు రోజులు ఆలస్యం కావడంతో పనులు నిలిచిపోయాయి. అప్పట్లో కాంక్రీట్‌ పనులు మందకొడిగా ఉండడంతో.. దీని ప్రభావం పెద్దగా కన్పించలేదు. కానీ ఇప్పుడు వడివడిగా కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై స్టే ఎంత ఆలస్యమైతే.. అంతకు రెండింతల నష్టం వాటిల్లుతుందని జల వనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read