ఆంధ్రుల జీవనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను నవయుగ చేతికి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో లేదో, నవయుగ రంగంలోకి దిగింది.... పేపర్ లో ప్రకటన ఇస్తూ, ఈ మహా యజ్ఞంలో మీరు భాగస్వాములు అవ్వండి అంటూ ఇలా ప్రకటన ఇచ్చింది "ఉదయించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్... ప్రతిష్టాత్మిక పోలవరం ప్రాజెక్ట్ ఒక సంవత్సరంలో పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో ఉన్నాం... ఈ భ్రమ్మండమైన ప్రాజెక్ట్ పూర్తి చేయటంలో మా బృందంతో జత కట్టండి" అంటూ, పోలవరం సైట్ లో, ఉద్యగాలు ఉన్నాయి అంటూ, ఏడు రోజుల్లో CVని పంపించమంటూ, ప్రకటనలు ఇచ్చింది....
గతంలో పనులు చేసిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ గడువులోగా పను లు చేయకపోవడంతో ప్రత్యమ్నాయచేసింది ప్రభుత్వం...ఈ నేపథ్యంలో కొత్తగా పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్గా నిర్మాణం పనులను చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకొచ్చింది. ఈ నెలాఖరు నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు పూరి స్థాయిలో ఏర్పాట్ల పూర్తి కావచ్చని అంటున్నారు... తదుపరి ఫిబ్రవరినెలలో ప్రాజెక్ట్ పనులు నవయుగ ప్రారంభించే అవకాసం ఉంది... ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జెన్కో విద్యుత్ కేంద్రం పనులను సైతం నవయుగ సంస్థ దక్కించుకుంది...
పోలవరం విషయంలో అటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా, ఇటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్ కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు అద్భుతమైన ఐడియా వేసారు... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా నవయుగకి పోలవరం పనులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు... పోలవరం స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు చేపట్టేందుకు ‘నవయుగ’ సంస్థను ముందుకు తెచ్చారు చంద్రబాబు... నవయుగ, ట్రాన్స్‌స్ట్రాయ్‌తో కలసి ఈ పనులు చేపట్టేందుకు అంగీకరించింది. అటు ట్రాన్స్‌స్ట్రాయ్ కూడా నవయుగతో కలిసి పని చేసేందుకు అంగీకరించింది.