పరిహారం చెల్లించకుండా పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజన గ్రామాలను తరలిస్తున్నారని, హైకోర్టులో పిటీషన దాఖలు అయ్యింది. పిటీషన్ పైన, హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. కొన్ని ఫోటోలతో కూడిన అడిషనల్ వివరాలు కూడా, పిటీషనర్ తరుపు న్యాయవాది, ఈ సందర్భంగా కోర్టుకు ఇచ్చారు. అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ ఖాళీ చేపించటం లేదని కూడా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ అడిషినల్ గా వివరాలు ఏవి అయితే ఇచ్చారో, ఆ మెటీరియల్ ఇంకా కోర్టు ముందుకు రాలేదని, అదే విధంగా ప్రభుత్వం వేసిన అఫిడవిట్ కూడా న్యాయస్థానం ముందుకు రాలేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ తమ ముందుకు రాలేదని, పిటీషనర్ వేసిన అడిషనల్ వివరాలు కూడా అందుబాటులోకి రాలేదని హైకోర్టు పేర్కొంది. మరోసారి ఇవి కోర్టు ముందు ఫైల్ చేయాలని, న్యాయస్థానం, ప్రభుత్వాన్ని అదే విధంగా పిటీషనర్ ను ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసారు. మొత్తం మీద నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా, వారిని అక్కడ నుంచి ఖాళీ చేపించటం పై, వేసిన పిటీషన్ పై మరింత జాప్యం జరిగే అవకాసం కల్పిస్తుంది.
ఎందుకంటే పిటీషనర్ తరుపు నుంచి వేసిన ఆధారాలు కానీ, ప్రభుత్వం వైపు నుంచి వేసిన అఫిడవిట్ కానీ, రెండు కూడా న్యాయస్థానం ముందుకు రాకపోవటంతో, ఈ కేసు వాయిదా పడింది. ఈ సారైనా సరే, అన్ని ఆధారాలు సమయానికి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరో పక్క ప్రభుత్వం పోలవరం విషయంలో కుప్పి గంతులు వేస్తూనే ఉంది. అసలు పోలవరం పూర్తి స్థాయి నిర్మాణం జరగకుండా, కేవలం ఒక స్థాయి వరుకే నీళ్ళు నింపుతారనే ప్రచారం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. కేంద్రం కూడా 55 వేల కోట్లు ఇవ్వలేం అని, 20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదో కంటితుడుపు చర్యలుగా లేఖలు రాస్తున్నారు కానీ, కేంద్రం పై ఒత్తిడి అయితే తేవటం లేదు. భూసేకరణ మొత్తం చేసి, నిర్వాసితులను పంపించాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరి వల్ల కాని పని. మరి పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏమి అవుతుంది ? కేంద్రం ఏమి చేస్తుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, పోలవరం అనుకున్నట్టే రాష్ట్రానికి జీవనాడి అవుతుందా, లేక ఒక పెద్ద రిజర్వాయార్ గా మార్చేస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.