ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలవరం మేము పూర్తి చేస్తాం, బట్టలు పెడతాం, టేపు పెట్టి కోలుసుకోండి, అదీ ఇదీ అంటూ, అసెంబ్లీలో, బయట ప్రెస్ మీట్లలో చేసే హడావిడి అందరూ చూస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో 72 శాతం పోలవరం పనులు అయితే, అప్పుడు అయ్యింది కేవలం 30 శాతం, మేమే ఈ 20 నెలల్లో పూర్తీ చేసాం అంటూ చెప్పుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే పునరావాసం పై కూడా ఎన్నో కబ్రులు చెప్పారు. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు సరైన ప్యాకేజి ఇవ్వటం లేదని, తాను ముఖ్యమంత్రి అయితే, ఎకరానికి 10 లక్షలు ఇస్తానని చెప్పారు. ఇలా ఎన్నో మాటలు చెప్పారు. అయితే ఈ 20 నెలల్లో ఒక్కరికి కూడా రూపాయి ఇచ్చింది లేదు. గతంలో చంద్రబాబు హయాంలో కట్టిన కాలనీలు పనులు కూడా ఆపేశారు. అక్కడ కూడా పనులు ఏమి జరగటం లేదు. పునారవాసం ఆగిపోయింది, భూసేకరణ లేదు, ఇలా మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయినా, మేము చేసేస్తాం, నీళ్ళు ఇచ్చేస్తాం, ఇదీ అదీ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తూ, ప్రతిపక్షం గొంతు నొక్కేసింది అధికార పక్షం. అయితే పై నుంచి వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాత్రం, అసలు గుట్టు విప్పేసింది. మీరు చెప్పే దానికి, గ్రౌండ్ లో జరుగుతున్న పనులకు సంబంధం లేదు కదా అని కడిగి పారేసింది.
41.15 మీటర్లకు, 17600 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, గతంలో 11, 000 గృహాలు అయ్యాయి. మిగతా 6,600ఇళ్ళలో, 2,600 వరకు చివరి స్టేజ్ లో ఉన్నాయి. అయితే మిగతా నాలుగు వేల ఇళ్లు, మార్చి నాటికి పూర్తీ చేస్తాం అంటూ, ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి చెప్పింది. అయితే ప్రభుత్వం చెప్పిన లెక్క పై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నమ్మలేదు. మూడు నెలల్లో నాలుగు వేల ఇళ్లు ఎలా కట్టగలరని ప్రశ్నించింది. వాటి గురించి మీ ప్రణాలికి ఏమిటి అని అడిగితే , ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించింది. సహాయ, పునరావాస పనులు పూర్తి చేస్తే తప్ప, కఫార్ డ్యాం అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పింది. అలాగే, 45.72 మీటర్లకు, 1,67,339.33 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇంకా 56 వేల ఎకరాలు పెండింగ్ లో ఉందని, ఇవన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారా అని ప్రశ్నించింది. అలాగే 1,05,601 కుటుంబాలకు ఇళ్లు కట్టాలని అంటున్నారని, కానీ ఇప్పటికి 3,110 ఇళ్లు మాత్రమే కట్టారని, మిగతావి డిసెంబర్ నాటికి ఎలా కడతారని ప్రశ్నించింది. అలాగే నిధులు పై కూడా చర్చ జరిగింది. మొత్తానికి ప్రభుత్వం చెప్తున్న దానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది.