పోలవరం ప్రాజెక్ట్... మన రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఒక జీవ నాడి... అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యటం, తన జీవిత ఆశయంగా పెట్టుకున్నారు... ఈ ప్రాజెక్ట్ కోసం, తన డైరీలో, సోమవారాన్ని, పోలవారంగా మార్చుకున్నారు... 2014 దాకా ప్రాజెక్ట్ సైట్ లో పిచ్చి మొక్కలు తప్ప, ఏమి ఉండేవి కాదు... తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, పోలవరం ప్రాజెక్ట్ ఏరియాలో, కొండలని పిండి చేస్తూ, పనులు మొదలు పెట్టి, ప్రస్తుతం 60 శాతం పనులు పూర్తయ్యేలా చేసి, పోలవరం పై ఆశలు రేపారు... అసలు పోలవరం ప్రాజెక్ట్ చూస్తామా అనుకున్న రోజులు నుంచి, 2019లో చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తారు అనే భరోసా కల్పించారు...
ఇంత చేస్తున్నా, కేంద్ర సహకారం అనుకున్నంత లేదు... అయినా, చంద్రబాబు ఓర్పుగా నెట్టుకొచ్చారు... కాని గత అక్టోబర్ నెల నుంచి, కేంద్రం కావాలని పోలవరం ప్రాజెక్ట్ లో కొర్రీలు పెట్టింది... మూడు నెలలు అమూల్యమైన సమయంలో పనులు చెయ్యకుండా, అడ్డు పడింది... ఆ సమయంలో చంద్రబాబు ఒకింత ఆగ్రహంగా అసెంబ్లీ సాక్షిగా, ఈ ప్రాజెక్ట్ మీరే పూర్తి చేస్తాను అంటే, దండం పీట్టి మీకే ఇచ్చేస్తా, ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇవ్వండి అని అన్నారు... అప్పటి నుంచి, రాష్ట్ర బీజేపీ నేతలు, జగన్ పార్టీ గ్యాంగ్ కొత్త ప్రచారం మొదలు పెట్టింది... పోలవరం ప్రాజెక్ట్ లో అక్రమాలు జరిగిపోయాయి, అవినీతి జరిగిపోయింది, చంద్రబాబు డబ్బులు కొట్టేసారు అంటూ ప్రచారం చేసారు...
కేంద్ర బడ్జెట్ తరువాత, చంద్రబాబు ఎదురు తిరగడంతో, ఈ ఆరోపణలు, మరింత ఎక్కువ అయ్యాయి... పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా, అవినీతి జరిగింది అంటున్నారు అంటూ ప్రచారం చేసారు... చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్పినా, లెక్కలు లేవు అన్నారు... చివరకు చంద్రబాబు, పోలవరం లెక్కలు అన్నీ వెబ్సైటు లో పెట్టారు... పోలవరం పురో గతి, పెట్టిన ఖర్చు తదితర పూర్తి వివరాలన్నీ http://polavaram.apegov.com/ispp/home# వెబ్ సైట్లో అందుబాటులో పెట్టారు... ఇంత పారదర్శకంగా అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టి, పనులు చేస్తుంటే, చేత కాని వారు, పనిలేని వారు, విమర్శలు చేస్తూ ఉంటే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీరికి సమాధానం చెప్తున్నా, విషయం అర్ధం కాని వారు, అలాగే విషయాన్ని తప్పుదోవ పట్టించే వారు, డయాఫ్రం వాల్ అంటే ఎక్కడ చూపించండి నాకు కనపడటం లేదు అనే వారు, చంద్రబాబు పై విమర్శలు చేసారు... చివరకు చంద్రబాబు పోలవరం లెక్కలు వెబ్సైటు లో పెట్టటంతో, ఒక్కడు అంటే ఒక్కడు కూడా, అప్పటి నుంచి పోలవరం పై అవినీతి అనలేదు.. పోనీ ఇదిగో తేడా అని ఒక్కడు కూడా చూపించలేదు... ఇది చంద్రబాబు పాలనలో ఉండే పారదర్శకత...