పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ, ఇప్పటికీ పనులు మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం, ఎప్పటికి మొదలు పెడుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు తాజగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును, పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతలు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుని, అందరికీ షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరరావు చాలా సీనియర్ అధికారి, వైఎస్ఆర్ హయంలో కూడా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక బాధ్యతలు ఆయనే చూసుకునే వారు. ఆయన్ను తప్పించటం పై, అందరూ ఆశ్చర్యపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ గా ఉన్న వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్ ఇంజినీర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా కూడా వెంకటేశ్వరరావు ఉన్నారు. వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి మాత్రమే కాకుండా, ఆయన్ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా కూడా తొలగించటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా జలవణరుల శాఖా అధికారులు, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ప్రస్తుతం, అటు కేంద్రానికి, రాష్ట్రానికి ఈ విషయంలో వార్ నడుస్తుంది. మరో పక్క, కోర్ట్ లో కూడా ఈ విషయం ఉంది. న్యాయ పరమైన విషయాలు ఎప్పటికి తెలుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ లో మొదటి నుంచి, ఉన్న ఇలాంటి సీనియర్ అధికారులను తప్పించటం పై అందరూ షాక్ అయ్యారు.
వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ హయం నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు చూస్తున్నారు. తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా అయన సేవలను పోలవరం ప్రాజెక్ట్ లో ఉపయోగించుకున్నారు. కేంద్రం నుంచి వివిధ పర్మిషన్ లు తీసుకు రావటంలో, నిధులు తీసుకురావటంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, ఈయన సేవలు, పోలవరం ప్రాజెక్ట్ కు అవసరం లేదని భావించి, ఆయన్ను, రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా మాత్రమే కొనసాగిస్తున్నారు. మరోప్ అక్క వెంకటేశ్వర రావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా సీఈ సుధాకర్‌బాబును ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన్ను ఎందుకు తప్పించారు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.