పోలవరం పై ఏపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటానికి, స్నేహితులు ఇద్దరూ అయిన, కేవీపీ, విజయసాయి, పోలవరం పై కేంద్రాన్ని ప్రశ్నలు అడిగారు. కేంద్ర సహాయం గురించి కాదండోయి, ఏపి ప్రభుత్వం, అవినీతి చేసిందా, కాంట్రాక్టు ఇచ్చిందా, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు. అయితే వీళ్ళకు దిమ్మ తిరిగే సమాధానం లభించాయి. ఏపి ప్రభుత్వం భేష్ అనే సమాధానం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యతాపరమైన లోపాలేవీ ఇప్పటి వరకు గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధిక చెలింపులు జరిపినట్టు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ)తో పాటు కాగ్‌ నివేదిక నిర్ధారించిన విషయం వాస్తవమేనని జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం మంత్రి రాతపూర్వకంగా పైవిధంగా జవాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులను వారి నుంచి తిరిగి రాబట్టాలని కూడా పీపీఏ సూచించిందని మంత్రి తెలిపారు. ఈ అక్రమ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ, త్వరితగతిన ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయించే హడావుడిలోనే భూ సేకరణ, స్టీల్‌ కొనుగోలుతో పాటు మరికొన్ని పనుల్లో ఆయా కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపినట్లు తెలిపిందని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆయా కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసినట్లుగా తెలిపారు.

polavaramquestion 18122018 2

పోలవరం హెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్ట్‌ను ఏదైనా కంపెనీకి లబ్ది చేకూర్చే విధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ వ్యవహరించిందా అన్న మరో ప్రశ్నకు మంత్రి మేఘ్‌వాల్‌ జవాబిస్తూ 2016 సెప్టెంబర్‌ 16న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరఫున పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేపట్టినట్లు వివరించారు. కాబట్టి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ కాంట్రాక్టులైనా ఇచ్చే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు 62.16 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా ఒక లక్షా 5 వేల 601 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయని, అందులో ఇప్పటి వరకు 3 వేల 922 నిర్వాసిత కుటుంబాలకు కొత్తగా నిర్మించిన 26 పునరావాస కాలనీల్లో ఆశ్రయం కల్పించడం జరిగిందని మంత్రి వివరించారు.

polavaramquestion 18122018 3

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం, భూసేకరణ, పరిహారం, పునరావాసంపై విడిగా అడిగిన ప్రశ్నలకు కూడా కేంద్రం సమాధానమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం, భూ సేకరణ, పరిహారం, పునరావాసం కోసం రూ. 57,940.86 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు పంపినట్టు తెలిపింది. 2013 నాటి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, పరిహారం, పునరావాసం అంచనాలు రూపొందించడం వల్లనే ఈ అంచనా వ్యయం భారీగా పెరిగిందని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక భూ సేకరణకు మొత్తం 1.66 లక్షల ఎకరాలు గుర్తించగా, అందులో 1.10 లక్షల ఎకరాలను ఇప్పటికే సేకరించినట్టు వెల్లడించింది. అలాగే మొత్తం 1,05,601 నిర్వాసిత కుటుంబాలున్నాయని, ఇందులో 3,922 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం పూర్తయిందని తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read