కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు... ఇప్పటికే, రాష్ట్ర బడ్జెట్ లో కూడా, 9 వేల కోట్లు, కేవలం పోలవరం కోసం కేటాయించారు... ఎలా అయినా, ఈ సంవత్సరం ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలని, కేంద్రం సహకరించక పోయినా, వెసులుబాటు కోసం, బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించారు.. మరో వైపు, నవయుగ రాకతో కాంక్రీట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. నిన్న చంద్రబాబు పోలవరం పై 53వ సారి సమీక్ష నిర్వహించారు.. చంద్రబాబు కూడా పనులు పై సంతృప్తి వ్యక్తం చేసారు.. గత వారంతో పోల్చుకుంటే, కాంక్రీట్ పనులు మరింత వేగం పుంజుకున్నాయని అన్నారు.. ఇకా యంత్రాలు, కార్మికలు సంఖ్య పెంచమని కాంట్రాక్టర్ ని కోరారు...
ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 54.4% పూర్తయ్యింది... కుడి ప్రధాన కాలువ 91% పూర్తవగా, ఎడమ ప్రధాన కాలువ 59.6% పూర్తయ్యింది... హెడ్ వర్క్స్ 41.2% అవ్వగా, మొత్తం తవ్వకం పనులు 70% పూర్తయ్యాయి... (1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 778.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి).. స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16% పూర్తయ్యాయి... డయాఫ్రమ్ వాల్ 72%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయ్యాయి... స్పిల్వే, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, గేట్లకు సంబంధించి మొత్తం 42 డిజైన్లకు గాను ఇప్పటివరకు 14 డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించింది, మరో 16 డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడం జరిగింది.. ఇవి కూడా త్వరలోనే ఆమోదం పొందే అవకాశముంది..
గడిచిన వారం రోజుల్లో పురోగతి వివరాలు : లక్షా 26 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు జరిగాయి... 17 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి... డయాఫ్రమ్ వాల్ 18.8 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది... స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, స్పిల్ చానల్ బ్రిడ్జి, డయాఫ్రమ్ వాల్, రేడియల్ గేట్ల నిర్మాణం ద్వారా వరద నీటి మళ్లింపునకు మొత్తం రూ. 9,189.81 కోట్ల వ్యయం అవుతుందని, ఇప్పటివరకు రూ. 3,448.29 కోట్లు ఖర్చు ఖర్చు చెయ్యటం జరిగిందని పెర్కున్నారు... ఈ పనులు పూర్తి చేసేందుకు ఇంకా రూ. 5,741.52 కోట్ల నిధులు అవసరం ఉంది...