పోలవరం పనులు రాత్రి పగులు అనే తేడా లేకుండా పరుగులు పెడుతున్నాయి... చంద్రబాబు ఎంతో పట్టుదలగా పనులు చేపిస్తున్నారు... కేంద్రం సరైన విధంగా నిధులు ఇవ్వకపోయినా, పనులు లేట్ అవ్వకుండా, రాష్ట్ర బడ్జెట్ లోనే, 9 వేల కోట్లు పోలవరానికి కేటాయించారు...వరద వచ్చే లోపు చేయాల్సిన కాంక్రీటు పనులను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పూర్తిచేయడానికి చర్యలు చేపట్టారు... రోజుకు నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేయాలని నిర్దేశించారు... పోలవరం హెడ్ వర్కులో భాగమైన మెయిన్ డ్యామ్ కు సంబంధించి స్పిల్ వే, స్పిల్ ఛానల్ 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు పని జరగాల్సివుండగా, ఇప్పటి వరకు 780.38 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయింది. అంటే స్పిల్ వే, స్పిల్ ఛానల్ 70 శాతం పని పూర్త యింది.
డయాఫ్రం వాల్ కు సంబంధించి మొత్తం 1427 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనికిగాను ఇప్పటి వరకు 1040.8 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. ఇటీవల కేంద్ర జలసంఘం బృందం వచ్చే సమయానికి 72.0 శాతం పూర్తయింది. కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ 1417 మీటర్ల మేర జరగాల్సివుండగా 1098 మీటర్ల మేర పూర్తయింది. ఎగువ కాఫర్ డ్యామ్కు సంబంధించి మొత్తం 2050 మీటర్ల జెట్ గ్రౌటింగ్ పనీ జర గాల్సి వుండగా ఇప్పటి వరకు 445.5 మీటర్ల పని పూర్తయింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను జెట్ గ్రౌటింగ్ పనులను స్పిలివే, స్పిల్ ఛానల్ పనులకు అనుసంధానం చేసుకుంటూ పూర్తిచేస్తున్నారు.
కుడి ప్రధాన కాల్వకు సంబంధించి 117.9 కిలోమీటర్ల మేర పూర్తయింది. లైనింగ్ 146.11 కిలోమీటర్లు పూర్తయింది. మొత్తం 182 స్ట్రక్చర్స్ పూర్తయ్యాయి. మొత్తం 255 స్ట్రక్చర్లు నిర్మించాల్సి వుంది. ఇందులో ప్రస్తుతం 56 స్ట్రక్చర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించి 210.9 కిలోమీటర్ల మేర తవ్వకం జరపాల్సివుంది. అయితే ఇప్పటి వరకు 164.7 కిలోమీటర్ల మేర పూర్తయింది. కాల్వ లైనింగ్ కు సంబంధించి 124.5 కిలోమీటర్ల మేర పూర్తయింది. 137 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. మొత్తం 152 స్ట్రక్చర్లు నిర్మించాల్సివుండగా, 87 స్ట్రక్చర్లు నిర్మాణ దశలో వున్నాయి. ఇక మట్టి పనికి సంబంధించి మొత్తం 1115.59 క్యూబిక్ మీటర్ల పని చేయాల్సివుంది. మార్చి వరకు 780.38 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయింది. ఇంకా 335.21 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిచేయాల్సి వుంది. కాంక్రీటు స్పిల్ వే, స్టీల్ బేసిన్ కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి గాను ఇంకా 10.69 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సివుంది..
స్పిలవేకు సంబంధించి కాంక్రీటు పని 11.95 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇంకా 7.67 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సివుంది. స్టిల్లింగ్ బేసిన్ కు సంబంధించి మొత్తం 4.44 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనికి సంబంధించి ఇంకా 3.02 లక్షల క్యూబిక్ మీటర్లు పని చేయాల్సివుంది. స్పిల్ ఛానల్లో సీసీ బ్లాకులకు సంబంధించి మొత్తం 18.75 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సివుంది. స్పిలవే, స్టీల్ బేసిన్ కు సంబంధించి మొత్తం 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సివుండగా 5.70 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. ఇంకా 10.69 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరగాల్సివుంది. నెలకు వేల క్యూబిక్ మీటర్ల స్థాయి నుంచి ప్రస్తుతం 2018 ఫిబ్రవరిలో 40 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని పూర్తి చేసే స్థాయికి చేరింది.
ఇక డయాఫ్రంవాల్ కు సంబంధించి మొత్తం 400 ప్యానెల్స్కు గాను ఇప్పటి వరకు 271 ప్యానెల్స్ కు పూర్త య్యాయి. మొత్తం 1447 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మించాల్సి వుంది. ఇక డిజైన్లకు సంబంధించి స్పిల్ వే 18 డిజైన్లకు గాను 7 డిజైన్లు సీడబ్ల్యూసీ ఆమోదం పొందాయి. మరో ఏడు డిజైన్లు వివిధ దశల్లోవున్నాయి. మరో నాలుగు డిజైన్లు సమర్పించడానికి కాంట్రాక్టు సంస్థ సిద్ధంచేసింది. ఎర్త్ కం రాక్ఫిల్ డ్యామ్కు సంబంధించి 17 డిజైన్లకు గాను సీడబ్ల్యూసీ నుంచి రెండు ఆమోదంపొందాయి. 8 డిజైన్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో ఏడు డిజైన్లు సమర్పించాల్సివుంది. గేట్లకు సంబంధించి ఏడు డిజైన్లు ఉండగా ఐదు డిజైన్లు సీడబ్ల్యూసీ ఆమోదం పొందాయి. ఒక డిజైన్ పరిశీలనలో ఉండగా మరో డిజైన్ సిద్ధం చేశారు. ఏదేమైనటికీ పోలవరం పనులు నిర్దేశిత ప్రణాళిక మేరకు కొత్త కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో ఊపందుకున్నాయి.