పోలవరం నిర్వాసితులు ఎదుర్కుంటున్న సమస్యల పై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలవరం ప్రాజెక్ట్ ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలోని కూనవరం, వీఆర్‍పురం మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఉన్న షడ్యుల్ తెగల వారిని, అక్కడ ఉండే నిర్వాసితులు అందరినీ కూడా, బలవంతంగా, రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయించిందని, వారికీ ఎటువంటి పరిహారం ఇవ్వకపోవటంతో పాటుగా, పునరావాసం కూడా కల్పించకుండా, ఉన్న పలాన, వారు నివాసం ఉంటున్న ప్రదేశాల నుంచి ప్రభుత్వం ఖాళీ చేయించిందని, ఈ విషయంలో షడ్యుల్ తెగల వారికి పూర్తి అన్యాయం జరిగిందని, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు, జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో, జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ఫిర్యాదుకు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి, అలాగే తూర్పు గోదావారి జిల్లా కలెక్టర్ కు, అలాగే కేంద్ర జలశక్తి కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు పై 15 రోజుల్లోగా స్పందించాలని ఆదేశించింది. 15 రోజుల్లోకు తమకు పూర్తి నివేదిక ఇవ్వాలని, 15 రోజుల్లో తమకు నివేదిక ఇవ్వక పొతే మాత్రం, వ్యకిగతంగా అందరూ నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంటుందని, హెచ్చరించింది. ఆ నోటీసులో ఈ విషయం స్పష్టంగా తెలిపారు.
ఇక కూనవరం, వీఆర్‍పురం మండలాల్లో కూడా అనేక గ్రామాల్లో, పోలవరం ముంపు ప్రాంతాల్లో అనేక మంది ఎస్సీలు ఉన్నారని, వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు, పరిహారంతో, పాటుగా పూర్తి సౌకర్యాలు ఉన్న పునరావాస కేంద్రాలు నిర్మించి, అక్కడకు తరలిస్తాం అని చెప్పి పేర్కొందని, కానీ అప్పుడు ఇచ్చిన హమీకు విరుద్ధంగా, ఇప్పటి ప్రభుత్వం అక్కడ ఉన్న నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించి, ఉన్న ప్రదేశం నుంచి వెళ్లి, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలని వారిని ఆదేశించటం, అక్కడకు కనీసం ఆహరం నీరు కూడా ఇవ్వకుండా, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీని వల్ల ఎస్సీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్సీ కమిషన్ కు రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాలు అన్నీ పరిశీలించిన ఎస్సీ కమిషన్, నిన్న సాయంత్రం, అధికారులు ముగ్గురికీ కూడా నోటీసులు జారీ చేయటమే కాకుండా, పూర్తి స్థాయి వివరణను ఎస్సీ కమిషన్ కు ఇవ్వాలని కోరింది. అయితే నిన్న జగన్ మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళిన తరువాతే, ఈ నోటీసులు రావటం కొసమెరుపు.