రాష్ట్ర వ్యాప్తంగా చకచకా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన హామీ మేరకు మూడవ సోమవారం అయిన 23న పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన ముందు నుంచి ప్రతి నెలా మూడవ సోమవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులను స్వయంగా పరిశీలిస్తానని తొలిదశలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడం తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఈ సోమవారం ఆయన పోలవరం పర్యటనకు నిర్ణయించారు. అయితే ఈ రోజు మాత్రం, పోలవరంలో అతి కీలకమైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు.. ప్రణాళిక ప్రకారం అత్యంత వేగంగా సాగుతున్నాయి. అనుబంధ పనులను పూర్తి చేయడానికి జలవనరుల శాఖ, నవయుగ కంపెనీ అడుగులు వేస్తున్నాయి.

polavaram 23042018

దీనిలో భాగంగా స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేందుకు ఇప్పటికే స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు, డయాఫ్రం వాల్‌, కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తున్నారు. స్పిల్‌వే నుంచి వచ్చే నీటిని మొత్తం ఈ స్పిల్‌ చానల్‌ ద్వారా తిరిగి గోదావరిలోకి కలుపుతారు. ప్రాజెక్టుకు సంబంధించి ఈ వేసవి అత్యంత కీలకమైన సమయంగా అటు అధికారులు, ఇటు ఇంజనీర్లు కూడా భావిస్తున్నారు. దానికి తగ్గట్టే ఈసీజన్‌కు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంతో ఇప్పటికే కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులు ముందడుగు వేశారు. ఈ కాలంలో గోదావరి ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం వున్నందున ఈ రోజుల్లోనే ఎక్కువ పనిచేసే అవకాశం వుంటుంది.

polavaram 23042018

ఈ వేసవి సీజన్‌లో అనుకున్న రీతిలో పనులు ముందడుగు వేస్తే పోలవరం ప్రాజెక్టు దాదాపుగా సహకారమైనట్లేనన్న అంచనా కూడా వ్యక్తమవుతోంది. ఏ రకంగా చూసినా ప్రస్తుతం జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటన అన్ని విధాలా కీలకమనే భావించాల్సి వుంటుంది. ఇనే్నళ్లుగా పడిన కష్టానికి దాదాపుగా ఒక ఆకారం వచ్చే అవకాశాలు ఈ వేసవి సీజన్ పనులతో భారీగా మెరుగుపడతాయని చెబుతున్నారు. అదే జరిగితే ప్రాజెక్టు అంశం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లే భావించాల్సి వుంటుంది. స్పిల్‌ చానల్‌ నిర్మాణంలో మొత్తం 3.20 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని బయటకు తరలించాల్సి ఉంది. ఇందుకోసం వందల సంఖ్యలో వాహనాలను భారీ డంపర్లు, ఎక్స్‌వేటర్లను మోహరించారు. రాత్రి పగలు పని చేస్తూ ఇప్పటి వరకు 2.18 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనిని పూర్తిచేశాయి.

polavaram 23042018

ఇంకా 1.2 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీయాల్సి ఉంది. స్పిల్‌ చానల్‌లో మొత్తం 2.92 కిలోమీటర్ల పొడవునా.. కిలోమీటరు వెడల్పులో కాంక్రీట్‌ వేయనున్నారు. దీని నిర్మాణంలో 18.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించనున్నారు. ఈ పనులను 7,520 బ్లాక్‌లుగా విభజించి కాంక్రీట్‌ వేస్తారు. పది మీటర్ల వెడల్పు, పది మీటర్ల పొడవు, ఒక మీటరు ఎత్తుతో వేసి దానిని ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. ఆ విధంగా నిర్మాణానికి 4,13,600 టన్నుల సిమెంట్‌ను, 17 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను, 9 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వినియోగించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read