కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న రాజకీయ వైరం నేపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ కు నెలకున్న ప్రధాన అడ్డంకి తొలగింది. పోలవరం స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై స్టే కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం, జూలై 2న ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే, దీని పై రెండు మూడు నెలల ముందు నుంచే, అధికారులు ఫాలో అప్ అవుతున్నా, కేంద్రం పట్టించుకోలేదు. గడువు దగ్గర పడే టైంకి, ఒకసారి కేంద్ర అధికారులు విదేశీ పర్యటనలో ఉంటే, ఒకసారి మంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. జూలై 2 తరువాత కూడా, కేంద్రం ఉత్తర్వులు ఇవ్వకపోవటంతో, రాష్ట్ర ప్రభుత్వానికి టెన్షన్ మొదలైంది. దీన్ని కూడా ఎదో ఒక సాకు చూపి, ఆర్డర్స్ ఇవ్వరు అని కంగారు పడ్డారు. అయితే, దాదాపు వారం రోజులు టెన్షన్ పెట్టి, కేంద్ర ప్రభుత్వం, మరో సంవత్సరం పాటు, పోలవరం స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై స్టే కొనసాగిస్తూ, ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది.

poalvarma 09072018 2

ఇదీ నేపధ్యం... పోలవరం ప్రాజెక్టుపై ఒడిసా, చత్తీ‌సగఢ్‌ అభ్యంతరాల నేపథ్యంలో నిర్మాణ పనులు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) 2015 చివరిలో ‘స్టాప్‌ వర్క్‌’ ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జావడేకర్‌ ఆ ఆదేశాల పై 2016లో స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో.. 2017 జూన్‌ 2వ తేదీ దాకా పనులు కొనసాగించే అవకాశం కలిగింది. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జావడేకర్‌తో మాట్లాడి స్టేను పొడిగించాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగేది.

poalvarma 09072018 3

అయితే.. ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జావడేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు. ఆయన స్థానంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలను అనిల్‌ దవే స్వీకరించారు. స్టే కాలపరిమితిపై పలు సందేహాలు వ్యక్తం చేసి.. చివరకు స్టాప్‌ ఆర్డర్‌పై స్టేను ఏడాదికే పరిమితం చేశారు. ఇప్పుడు మరోసారి, సంవత్సరం పాటు కేంద్రం దీన్ని పొడిగించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఇలా ఏడాడి ఏడాడి కాకుండా, ప్రాజెక్ట్ పూర్తి చేసేంతవరకు, ఉత్తర్వులు ఇవ్వాలని, ఎంత కోరినా, కేంద్రం మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీని వెనుక రాజకీయ కారణం కనిపిస్తుంది. ఇలా అయితే, రాష్ట్రం ఆయువపుట్టు తన చేతిలో ఉంచుకోవచ్చు అని కేంద్రం భావాన. అందుకే సంవత్సర కాలం పాటే, పర్మిషన్ ఇస్తూ, ప్రతి సంవత్సరం టెన్షన్ పెడుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read