ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 64 శాతం పనులు పూర్తి అయ్యాయి. కేంద్రం ఈ ప్రాజెక్టు పనులకు సహకరించక పోయినా... ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులను పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో, రేపు గిన్నిస్ రికార్డు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ప్రాధాని మోడీ మాట్లాడుతూ, అసలు పోలవరంలో పనులే జరగటం లేదు అంటున్నారు, కనీసం, ఈ గిన్నీస్ రికార్డు చూసైనా తెలుసుకుంటారేమో.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నర పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్డు గిన్నిస్ రికార్డు సాధించే దిశగా సాగుతోంది... పోలవరం కాంక్రీటు పనుల్లో మరో కీలక ఘట్టం రేపు చోటుచేసుకోనుంది. గిన్నిస్ రికార్డు సాధించే దిశగా నవయుగ నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టులోని స్పిల్ వే, స్పిల్ చానల్లో 6వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభించి 7వ తేదీ ఉదయం 7 గంటల వరకు 24 గంటల్లో 28 వేల నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పనులతో గిన్నిస్ రికార్డు సాధించి తీరుతామని నవయుగ నిర్మాణ సంస్థ ప్రకటించింది... మరో పదేళ్ల వరకు ఈ రికార్డును ఎవరూ అధిగమించలేని విధంగా పనులు జరుగుతాయంటున్నారు.
ఇక దీని కోసం నవయుగ కంపెనీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది... కాంక్రీటును స్పిల్ చానల్, స్పిల్‌వేలో వేసే విధంగా కాంక్రీటు మిక్చర్ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా దారులు ఏర్పాటు చేశారు. ప్రతీ నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని గిన్నిస్ రికార్డు సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఈ పనులను పరిశీలించి రికార్డు నమోదు చేసేందుకు లండన్ నుంచి గిన్నిస్ బుక్‌కు సంబంధించిన అధికారులు కూడా రానున్నారు. కొందరు నిపుణులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఈ రికార్డు పరిశీలనకు మొత్తం 24 మంది వస్తారని నవయుగ నిర్మాణ సంస్థ ప్రకటించింది.