ఈ రోజు మధ్యానం అసెంబ్లీలో, 2023 ఖరీఫ్ సీజన్ నాటికి, పోలవరం పూర్తి చేస్తానని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రకటించిన గంటలోనే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎందుకు ఆగిపోయింది అనే వివరాల్లోకి వెళ్తే, ఇసుక సరఫరా నిలిచి పోవటంతో, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. జేపీ వెంచర్స్ అనే ఒక బినామీ కంపెనీకి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రంలో ఇసుక ర్యాంప్ లు అన్నీ కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీని వెనుక డైరెక్ట్ గా జగన్ ఉన్నాడని, టిడిపి ఆరోపిస్తూ ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ చేస్తుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. పోలవరం ప్రాజెక్ట్ లో నవయుగని బయటకు పంపించి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ కు పోలవరం కట్టబెట్టింది. అయితే మేఘా ఇంజనీరింగ్ అక్కడ పనులు ఏమి చేయలేదని, ఎన్నో ఆర్టిఐ రిపోర్ట్ లు చెప్తున్నాయి. అయితే ఒక పక్క మేఘా ఇంజనీరింగ్ కానీ, మరో పక్క ఇసుక తీసే జేపీ కానీ, రెండూ కూడా ప్రభుత్వ అనుకూల సంస్థలే. రెండూ కూడా ప్రభుత్వ పెద్దలకు అతి దగ్గరవే. అలాంటిది జేపీ వెంచర్స్ ఇసుక ఆపేయటం, తమకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తేనే తాము, ఇసుక ఇస్తామని చెప్పటం, మేఘా టిప్పర్లు అన్నీ వెనక్కు వచ్చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
జేపీ సంస్థ ఇసుక ఆపేసిందని, మేఘా సంస్థ ప్రభుత్వానికి కూడా సమాచారం అందించిందని చెప్తున్నారు. తమకు ఇసుక తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చినా, జేపీ సంస్థ అడ్డుపడుతుందని, మేఘా వాదన. అయితే ఈ రెండు సంస్థలు ప్రభుత్వ పెద్దలకు దగ్గరవి అయినా, ఇలా ఎందుకు చేసాయో, ఎవరికీ అర్ధం కావటం లేదు. తెలుగుదేశం పార్టీ ఇదంతా డ్రామా అని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం, ఇసుకని తీసుకునే హక్కు కాంట్రాక్టర్ కు ఉంది. అయితే ఇప్పటి వరకు, ఇసుక ఇచ్చిన జేపీ వెంచర్స్, ఇప్పుడు ఎందుకు ఆపేసిందో, ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఎవరి స్కెచ్ ప్రకారం, ఈ పరిణామం జరిగిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇప్పటి వరకు ఇచ్చే, ఇప్పుడు ఎందుకు ఆపెసారో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా డ్రామా అని, ఎక్కడా పోలవరం పనులు పూర్తి కాక పోవటంతో, ఇప్పుడు ఈ కొత్త డ్రామా మొదలు పెట్టారని, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా ఆరోపించారు.