కాఫర్ డ్యాం ఆపండి... స్పిల్ వే, స్పిల్ వే చానల్ టెండర్ల ఆపండి... అంటూ కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా, చంద్రబాబు అడుగులు మాత్రం ముందుకే... పోలవరం అదే జోరుతో కొనసాగుతుంది... ఎక్కడా ఒక్క పని కూడా ఆపలేదు... వనకడుగే లేదు... ఒకసారి పనులు ఆగితే పని చేస్తున్న సంస్థలు, అక్కడున్న యంత్రాలు అన్నీ వెళ్లిపోతాయి. మళ్లీ వాటిని తీసుకురావడం కష్టం. ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి రావడం కష్టం. ఒకసారి ఆగితే అది పూర్తయ్యేందుకు ఐదేళ్లు పడుతుందా? పదేళ్లు పడుతుందా? అన్నది తెలియదు. అందుకే ఒక్క పని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదు అని, ముందుకే సాగుతున్నారు...
ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే కాంక్రీట్ పనులు గతంలో మాదిరే సాగుతున్నాయి. ఇప్పటి వరకు 35శాతం కాంక్రీట్ పనులు పూర్తవ్వగా మిగిలిన వాటినీ వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో కాంట్రాక్టు సంస్థలు పనులు నిర్వహిస్తున్నాయి. రోజుకి 3వేల క్యూబిక్ మీటర్ల పని సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి స్పిల్‌వేలోని 48 బ్లాక్‌లను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
48 బ్లాక్‌ల్లో ఇప్పటికే 23 బ్లాక్‌ల్లో కాంక్రీట్ పని పురోగతిలో ఉంది. 48 రేడియల్ గేట్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. క్రస్ట్ లెవెల్ వరకు స్పిల్‌వే కాంక్రీట్ పనులు పూర్తయితే ఇక మిగిలింది గేట్లను అమర్చడమే. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర బృందం ఇచ్చిన సూచనతో... నిర్మాణ వేగాన్ని పెంచడానికి పనుల విభజన, కొత్త టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.