Sidebar

17
Mon, Mar

అమరావతి రోడ్డులోని వేళంగిణినగర్‌ దగ్గర చేసిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. వాహనంలో తరలిస్తున్న రూ.కోటి పది లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు నగదుగా అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో తరలిస్తున్న సొమ్ముగా పోలీసులు భావిస్తున్నారు. ఈ డబ్బు ఏ పార్టీకి చెందిన నేతదన్నది తెలియాల్సి ఉంది. మరో చోట, వోల్వో బస్సులో తరలిస్తున్న రూ. 88.88లక్షల నగదు, 1.28 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామం దగ్గర బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇద్దరు వ్యక్తుల దగ్గర రూ.88.88 లక్షలు, 1.28 కేజీల బంగారాన్ని కనుగొన్నారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

police 13032019

డబ్బును ఒకచోట నుంచి మరోచోటుకు తీసుకెళ్లడం చట్ట ప్రకారం అక్రమం కాదు. కానీ ఎన్నికల కోడ్‌ అమలో ఉన్నప్పుడు నగదు, బంగారం భారీ మొత్తంలో తీసుకెళ్లొద్ధు ఎన్నికల కమిషన్‌ కొంత పరిమితిని నిర్దేశించింది. ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే.. వాటికి సరైన ఆధారాలు చూపించాలి. లేకుంటే అంతే సంగతులు. నియోజకవర్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటి వద్ద రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటారు. ఆదాయ పన్నుశాఖకు జప్తు చేస్తారు. అక్కడి నుంచి నగదును పొందాలంటే కష్టం. ఆధారాలు, వివరణ సరిగా లేకపోతే 30 శాతం పన్ను కింద తీసుకుని మిగతా సొమ్ము ఇస్తారు. ఈ నిబంధనలు తెలియక చాలామంది పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తూ దొరికిపోతున్నారు. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్‌ 69-ఎ ప్రకారం ఏ వ్యక్తి అయినా తన వద్ద ఉన్న డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులుంటే వాటికి ఆధారం చూపించాలి. సరైన వివరణ ఇవ్వాలని స్పష్టంగా చట్టంలో ఉంది.

police 13032019

తనిఖీ బృందంలో ఎవరుంటారు? నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు చొప్పున తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉప తహసీల్దారు, పోలీసు విభాగం నుంచి ఏఎస్సై, కానిస్టేబుల్‌ ఉంటారు. గమనించాల్సిన విషయాలు ● ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్‌ 40(3) ప్రకారం ఒకరోజు ఒక వ్యక్తి లేదా సంస్థకు రూ.10 వేలకు మించి నగదు ఇవ్వొద్ధు ● సెక్షన్‌ 269 ఎస్‌ఎస్‌ ప్రకారం రూ.20 వేలకు మించి అప్పు తీసుకోకూడదు. ● సెక్షన్‌ 269 ప్రకారం రూ.20 వేలకు మించి అప్పు చెల్లించరాదు. అప్పు తీసుకుంటే.. అవసరం నిమిత్తం రూ.లక్షల్లో అప్పు తీసుకుంటారు. ఆ సొమ్ము తీసుకెళుతున్నప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి రాయించుకున్న ప్రామిసరీ నోటు నకలు వెంట తీసుకెళ్లాలి. వైద్య సేవలకైతే.. ఆసుపత్రిలో వైద్య సేవలకు బిల్లు కట్టడానికి ఎక్కువ మొత్తం తీసుకెళ్తుంటారు. ఆ సమయంలో చికిత్సకు ఎంత మొత్తం ఖర్చవుతుందని తెలిపే బిల్లు, అది కాకపోతే ఎస్టిమేషన్‌ కాపీ చూపించాలి. పంట అమ్మితే.. ప్రస్తుతం రబీ పంట కొనుగోళ్లు, ఉద్యాన పంటల అమ్మకాలు జరుగుతున్నాయి. విపణిలో పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. నగదు తీసుకెళ్లే సమయంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అమ్మకం పట్టీ దగ్గర ఉంచుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read