డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళవాయి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని పోలీసు అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సంఘటన జరిగినప్పుడు లభించిన సాక్ష్యాధారాలను బట్టి వాస్తవాలు పోలీసులు చట్టబద్ధంగా వెలుగులోకి తీసుకువస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డీజీపీపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చట్ట ప్రకంగా వెళ్తామని వార్నింగ్ ఇచ్చారు.
డీజీపీ పరీక్షలు రాస్తూ ఉంటే ఆయన చిట్టీలు అందించారా అని ప్రశ్నించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విజయసాయి డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘డీజీపీ.. టీడీపీ కార్యకర్తవా? కాపీ కొట్టి ఐపీఎస్ పాసయ్యావా?’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్‌పై జరిగిన దాడిమీద స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వ్యక్తి జగన్‌కు అభిమానిగా పేర్కొంటూ.. ఉద్దేశపూర్వకంగా అతను దాడి చేయలేదని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. డీజీపీకి మతి భ్రమించినట్టుందని వ్యాఖ్యానించారు.
మరో పక్క ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత జగన్‌కు నమ్మకం లేదనడం దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించిందన్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతోందని తెలిపారు. జగన్ పోలీసులకు సహకరించకుండా.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం దురదృష్టకరమన్నారు. ఒక పక్క విజయసాయి రెడ్డి డీజీపీని అలా అంటుంటే, జగన్ ఏపి పోలీసుల్ని ఇలా అంటున్నారని అన్నారు. జగన్ విశాఖలో వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్లారు?అని అడిగారు. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేస్తే గవర్నర్ స్పందించలేదన్నారు. అలాంటిది జగన్‌పై దాడి జరిగిన వెంటనే గవర్నర్.. డీజీపీకి ఫోన్ చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.